Ladies Finger Farming : వేసవికాలంలో బెండ పంటను సాగు చేస్తే.. పాటించాల్సిన సరైన సేంద్రియ పద్ధతులు..!

వేసవికాలంలో బెండను సాగు( Ladies Finger Farming ) చేసే రైతులు సేంద్రియ పద్ధతులు పాటిస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చు.

సేంద్రీయ పద్ధతుల వల్ల భూసారం తో పాటు రోగ నిరోధక శక్తి( Immunity Booster ) కూడా పెరుగుతుంది.

వేసవిలోని వేడి వాతావరణం బెండ పంటకు చాలా అనుకూలంగా ఉంటుంది.జనవరి రెండవ వారం నుంచి ఫిబ్రవరి చివరి వరకు బెండను విత్తుకోవచ్చు.

తేలికపాటి రేగడి నేలలు, నీరు ఇంకిపోయే తేలికపాటి నేలలు, మురుగు నీటి సౌకర్యం ఉండే తేలికపాటి నేలలు బెండ పంట సాగుకు చాలా అనుకూలం.

బెండ విత్తనాలు( Ladies Finger Seeds ) విత్తిముందు సేంద్రియ పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఆవు మూత్రాన్ని, నీటిని 1:5 నిష్పత్తిలో కలుపుకొని అందులో 30 నిమిషాల పాటు నానబెట్టాలి.అమృత జలం లేదంటే పంచగవ్యం ద్రావణం( PanchaGavya ) లో 8 గంటలు నానబెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తాలి.

Advertisement

ఒక లీటరు నీటిలో 15 మిల్లీ లీటర్ల కోడిగుడ్లు, నిమ్మరసం ద్రావణం కలిపి పిచికారి చేస్తే దిగుబడులు పెంచవచ్చు.బెండ పంట పూత దశకు వచ్చే ముందు ఐదు శాతం పంచగవ్య ద్రావణం పిచికారి చేయాలి.

పంట రెండు వారాల వయస్సు లో ఉన్నప్పుడు నాలుగు లీటర్ల జీవామృతంను సాగు నీటితో పాటు అందించాలి.బెండ మొక్క నాలుగు నుంచి ఆరు ఆకుల దశలో ఉన్నప్పుడు తులసీ-కలబంద కషాయం( Tulsi Aloe Vera ) పిచికారీ చేయాలి.

ఎరువుల విషయానికి వస్తే ఒక ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు, 500 కిలోల ఘన జీవామృతం, 100 కిలోల వేపపిండి, 35 కిలోల వేరుశెనగపిండి, రెండు కిలోల పాస్పో బ్యాక్టీరియా, రెండు కిలోల అజోస్పైరిల్లంను ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.ఒక ఎకరానికి 200 లీ.జీవామృతంను 15 రోజుల వ్యవధిలో సాగునీటితో పాటు పంటకు అందించాలి.ఇలా ఎక్కువగా సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇచ్చి పంటలు పండిస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.

రామ్ చరణ్ సినిమాకు అందుకే నో చెప్పా.. విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు