వలస వాసులకు శాపంగా మారుతున్న కువైటైజేషన్..గడిచిన 3ఏళ్ళలో...

గల్ఫ్ దేశాలకు విదేశాల నుంచీ ఎంతో మంది వలస వాసులు కార్మికులుగా పనిచేయడానికి వలసలు వెళ్తూ ఉంటారు.అలా వలసలు వెళ్ళే వారిలో అత్యధికులు భారతీయులే.

అయితే పలు దేశాల నుంచీ భారీ స్థాయిలో గల్ఫ్ దేశాలకు వెళ్ళడంతో అక్కడ ఉద్యోగాలు అన్నీ వలస వాసులతో నిండిపోయాయి.దాంతో పలు దేశాలు వలస వాసులను తరిమికొట్టి తమ దేశస్తులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాలికలు సిద్దం చేసింది.

ఈ క్రమంలోనే 2017 లోనే కువైట్ తమ దేశంలో ఉన్న వలస వాసులను పంపేందుకు కువైటైజేషన్ ను ప్రవేశ పెట్టింది.దాంతో వలస వాసుల సంఖ్య మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతోంది కువైట్ దేశంలో.ఇదిలాఉంటే సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం గడిచిన మూడేళ్ళ లో కువైట్ లో వలస వాసుల సంఖ్య భారీగా తగ్గిందట.2018 లో 28.91 లక్షలు ఉన్న ప్రవాసుల సంఖ్య 2021 నాటికి 25.20 లక్షలకు పడిపోయిందని అంటే సుమారు 3.71 లక్షలు మంది కువైట్ విడిచి వెళ్లిపోయారని నివేదిక వెల్లడించింది.అంతేకాదు ఈ మూడేళ్ళ కాలంలో వర్క్ పర్మిట్లు పొందిన వారి సంఖ్య గతంలో కంటే భారీగా తగ్గిందని తెలుస్తోంది.2018 లో 1.7 లక్షల మంది వర్క్ పర్మిట్లు పొందితే 2021 లో కేవలం 96 వేల మందికి మాత్రమే వర్క్ పర్మిట్లు వచ్చాయని నివేదిక వెల్లడించింది అంటే దాదాపు 11 వేల మంది మాత్రమే వర్క్ పర్మిట్లు పొందారు.ఉల్లంఘనలకు పాల్పడిన వారు, అలాగే డ్రైవింగ్ విషయంలో పదేపదే తప్పులు చేసిన వారు, వర్క్ పర్మిట్ల విషయంలో రెన్యువల్స్ చేసుకొని వారు, వృద్దాప్య సమస్య ఇలా అనేక రకాల కారణాలను చూపిస్తూ ప్రతీ ఏడాది వేలాది మందిని కువైట్ పంపేస్తోందట.

గతంలో కువైట్ స్థానిక ప్రజలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపేవారు కాదని, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వారిలో మార్పు కలిగిందని వలస వాసులు చేసే చిన్న చిన్న పనులు తాము కూడా చేస్తామని ముందుకు రావడంతో కువైట్ ప్రభుత్వం కువైటైజేషన్ ను వేగవంతం చేస్తోందని తెలుస్తోంది.

Advertisement
ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!

తాజా వార్తలు