కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సంచలన పోస్ట్..!!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం తెలిసిందే.

అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో.

స్టీఫెన్ సన్ నీ కొనటానికి ప్రయత్నిస్తూ ఆడియో వీడియో రూపంలో అడ్డంగా దొరికిపోయారు.ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ గా రాణిస్తున్నారు.మరి కొద్ది రోజుల్లో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో అధికార పార్టీ బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఎన్నికలలో గెలుస్తుందని అధికారంలోకి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

ఇదే సమయంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ కూడా ఇటీవల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యానాలు చేశారు.ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి సంచలనం పోస్ట్ పెట్టారు."రేవంత్ రెడ్డి ఆరోజు మీ ఇంటికి ఎందుకొచ్చాడు.?? మా ఇంటికి మా అమ్మను కొనడానికి వచ్చాడు.తెలంగాణ మా తల్లి.

మా తల్లిని 5 కోట్లకు కొనడానికి వచ్చిండు.ఐదు కోట్లు ఇస్తా, మీ అమ్మను అమ్ము అన్నాడు.

అమ్మను అమ్ముకుంటాడా ఎవడైనా.?? ఐదు కోట్లు కాదు ఐదువందల కోట్లిచ్చినా నేను అమ్మను అని చెప్పిన.- స్టీఫెన్సన్" అనీ ట్వీట్ చేశారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు