హిందీ భాషను ఇటీవల ఐఐటీలో ఉద్యోగం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం హిందీ తప్పనిసరి అని నిబంధనలు పెట్టింది ఈ నేపథ్యంలో,భారతదేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదని, అధికారిక భాషల్లో హిందీ ఒకటని మంత్రి కేటీఆర్ అన్నారు.‘ఐఐటీల్లో, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేయడం అంటే ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసినట్లే.భాషను ఎంచుకునే హక్కు భారతీయులకు ఉంది.హిందీని మాపై రుద్దితే వ్యతిరేకిస్తాం’ అని ట్వీట్ చేశారు.







