మాజీ సీఎం రోశయ్య బంధువు హత్య కేసులో తుది తీర్పు వెలువడింది.పదేళ్ల క్రితం బెంగళూరులో హైదరాబాద్ కు చెందిన పారిశ్రామిక వేత్త మనోజ్ గ్రంధి హత్యకు గురైన సంగతి తెలిసిందే.ఈ కేసులో ముగ్గురు నిందితులను కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.2012 ఫిబ్రవరి 6న మనోజ్ గ్రంధి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.అక్కడ ఓ కారును అద్దెకు తీసుకున్నారు.అయితే మనోజ్ వద్ద కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు నగలు ఉన్నట్లు గమనించిన కారు డ్రైవర్ రవికుమార్.కృష్ణ గౌడ్, శివలింగయ్య అనే ఇద్దరు స్నేహితులకు తెలిపారు.ఈ క్రమంలో బళ్లారి రోడ్డులో కారును అడ్డగించిన దుండగులు మనోజ్ ను హత్య చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, రూ.2 కోట్ల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.తాజాగా ఈ కేసులో ముగ్గురు నిందితులకు నగర 52వ అదనపు సివిల్, సెషన్స్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.







