కేసీఆర్ రాజకీయం ఇప్పుడే స్టార్ట్ అయిందిగా ?

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడడంతో ఇప్పుడు అసలు సిసలు రాజకీయానికి రాజకీయ పార్టీలు తెరలేపాయి.

ఓటర్లను ఎలా బుట్టలో వేసుకోవాలి అనే విషయం పై తర్జన భర్జన పడుతున్నాయి.

ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త ఆలస్యంగా అయినా ఇప్పుడు రంగంలోకి దిగారు.తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం అయినా కేసీఆర్ ప్రచారానికి రాకుండా ఆ బాధ్యత తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించాడు.

ఆయన కూడా ప్రచార బాధ్యతలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ఎమ్మెల్యేలకే అప్పగించారు.ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తరువాత కేసీఆర్ రంగంలోకి దిగినట్టు సమాచారం.

సోమవారం సాయంత్రం నుంచి నాయకులతో ఆయనే స్వయంగా ఫోన్లు చేస్తూ ఎన్నికల పరిస్థితులు, అభ్యర్థుల బల, బాలల గురించి ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది.కేసీఆర్ కాస్త ఆలస్యంగా అయినా స్పందించడానికి ప్రధానం గా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.మొదటిది, మంత్రి కేటీఆర్ ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉండడం, ఎన్నికలకు ఇది అత్యంత కీలక సమయంలో కావడంతో పార్టీ కేడర్ కి అందుబాటులో ఉండలేని పరిస్థితి వచ్చింది.

Advertisement

దీంతో కేసీఆర్ స్వయంగా మంత్రులూ ఎమ్మెల్యేలతోపాటు, కొంతమంది అభ్యర్థులకు కూడా ఫోన్లు చేసి పార్టీ పరిస్థితిని ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక నిజామాబాద్ జిల్లాలో స్థానికంగా కొంత వ్యతిరేకత వ్యక్తమౌతోందనీ, స్థానిక నేతల వల్ల పరిస్థితి చక్కబడలేదని తెలియడంతో ఆ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టు సమాచారం.ఇప్పటికే మంత్రి ప్రశాంత్ రెడ్డిని నిజామాబాద్ జిల్లాకి సీఎం పంపించారు.ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసిన కవిత ఓటమి చెందిన సంగతి తెలిసిందే.

ఇప్పుడైనా ఇక్కడ పట్టు సాధించి పోయిన పరువుని కాపాడుకోవాలనే తాపత్రయం టీఆర్ఎస్ అగ్ర నాయకుల్లో కనిపిస్తోంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు