కూతురు చేసిన పనితో వంద కోట్లు నష్టపోయిన కృష్ణం రాజు ..అయిన కూడా ?

కృష్ణం రాజు. రెబల్ స్టార్ గా టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిన హీరో.

మల్టీ స్టారర్ సినిమాలకు ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా ఉండేవారు.సినిమాల్లో నటిస్తున్న గోపి కృష్ణ ఫిలిమ్స్ అనే ఒక సంస్థ ను ప్రారంభించి మంచి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు కృష్ణం రాజు మరియు అతడి సోదరుడు సూర్య నారాయణ రాజు.

సినిమా నిర్మాణం లో మంచి టేస్ట్ కలిగి ఉండేవారు కూడా.తమ లాగే తమ పిల్లలను కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుక వచ్చారు.

సూర్య నారాయణ రాజు కొడుకు ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక ప్రభాస్ సోదరుడు ప్రమోద్ సైతం డిస్ట్రిబ్యూషన్ రంగం లో ఉన్నారు.

Advertisement

కృష్ణం రాజు కన్ను మూస్తే ప్రమోద్ ఇంటికి పెద్ద కొడుకుగా తలకొరివి పెట్టాడు.ఇక కృష్ణం రాజు కు నాలుగు ఆడ పిల్లలు.

అందులో ముగ్గురు అయన సొంత కుమార్తెలు కాగా, ఒక అమ్మాయి ప్రశాంతి ని మాత్రం దత్తత తీసుకున్నారు.ఇక సూర్యనారాయణ రాజు వారసులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీ లో రాణిస్తుంటే, కృష్ణం రాజు కుమార్తెలు మాత్రం తొలినాళ్లలో సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నారు.

కానీ ప్రభాస్ తో కృష్ణం రాజు కుమార్తెలకు మంచి అనుబంధం ఉంది.

దాంతో తండ్రి తోడ్పాటు, అన్నల సహకారం తో కృష్ణం రాజు పెద్ద కుమార్తె సాయి ప్రసీద తండ్రి వారసత్వాన్ని నిలపాలనుకుంది.ఫారెన్ చిత్ర నిర్మాణం పై, టెక్నాలజీ పై మెళకువలు నేర్చుకుంది.అక్కడ నేర్చుకున జ్ఞానాన్ని తెలుగు సినిమాల ద్వారా ముందుకు తేవాలనుకుంది, అనుకున్నదే తడవుగా మొదట ప్రభాస్ హీరో గా నటించిన రాధే శ్యామ్ సినిమా కోసం సహా నిర్మాత గా కూడా మారింది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

తండ్రి ఇచ్చిన వంద కోట్లను సినిమా నిర్మాణం లో పెట్టింది.ఇదే చిత్రం లో ప్రభాస్ అన్నయ్య కూడా నిర్మాతగా ఉన్నాడు.కానీ సినిమా పరాజయం పాలవ్వడం తో కుమార్తె పై నమ్మకం తో ఇచ్చిన వంద కోట్లలో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదు.

Advertisement

అయిన కూడా ఏం పర్వాలేదు నేర్చుకో ఇంకా ఎంతో భాసవిష్యత్తు ఉంది అని కూతురికి అభయం ఇచ్చాడట కృష్ణం రాజు..

తాజా వార్తలు