హైదరాబాద్ పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయం

హైదరాబాద్ పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు.

మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానులు ఆయన పార్థీవదేహాన్ని సందర్శించేందుకు అనుమతినిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు.తమ అభిమాన హీరోకు కన్నీటి నివాళులర్పిస్తున్నారు.

ఆయన కడచూపు కోసం ఫ్యాన్స్ తరలివస్తున్నారు.మధ్యాహ్నం తర్వాత మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.మరోవైపు ఉదయం 11.20 నిమిషాలకు ఏపీ సీఎం జగన్ పద్మాలయ స్టూడియోకి చేరుకోనున్నారు.కృష్ణ భౌతికకాయానికి జగన్ నివాళులర్పించనున్నారు.

Advertisement

అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు