ఎంపీడీఓ సరళ పెట్టిన కేసులో భాగంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు నేడు ఉదయం అరెస్ట్ చేశారు.తెలుగు దేశం పార్టీ నాయకుల నుండి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాల్సిందిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి డీజీపీని ఆదేశించారు.
ఎమ్మెల్యే అరెస్ట్‌తో తాము పక్షపాతంగా వ్యవహరించడం లేదని చెప్పేందుకు జగన్ ప్రయత్నించారు.కేసులో అరెస్ట్ అయిన కొద్ది సమయంకే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి బెయిల్‌పై విడుదల అయ్యారు.
విడుదలయ్యాక ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ నన్ను అరెస్ట్ చేయించారని పేర్కొన్నాడు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.
చట్టానికి ఎవరు అతీతులు కారు అని చెప్పేందుకు జగన్ గారు నన్ను అరెస్ట్ చేయించారు.అయితే కేసు విషయంలో నేను క్లీన్ చీట్‌తో బయటకు వస్తాననే నమ్మకం నాకు ఉంది.
జిల్లా ఎస్పీకి నాకు ఎన్నికల ముందు నుండే విభేదాలు ఉన్నాయి.ఎన్నికల సమయంలో కూడా నాకు ఇబ్బంది కలిగించాడు.
ఇప్పుడు ఆదేశాలు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేందుకు హడావుడి చేశాడు.ఒక శాసనసభ్యుడిని అనే విషయాన్ని కూడా మర్చిన ఆయన నన్ను అరెస్ట్ చేసేందుకు చాలా హంగామా చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ కేసును తాను న్యాయ స్థానంలో ఎదుర్కొంటానంటూ ప్రకటించాడు.