పెరిగిన సోషల్ మీడియా పరిధి కారణంగా మనం ఈమద్య కాలంలో వైధ్య శాస్త్రంలో జరుగుతున్న అభివృద్ది మరియు ఆశ్చర్యకర విషయాల గురించి రెగ్యులర్‌గా వింటూనే ఉన్నాం.ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయితే గుండెను మార్చుతున్నారు, శరీర భాగాలు ఒకరి నుండి ఒకరికి మార్చడం చాలా తరచు చూస్తూనే ఉన్నాం.
దేనికి అదే చాలా విభిన్నం, వైరుద్యం అనుకుంటూ ఉండగా మరో ఆశ్చర్యకర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.అందేంటి అంటే ఒక వ్యక్తి శరీరంలో భాగాలు అన్ని కూడా కుడి ఎడమ, ఎడమ కుడి అయ్యాయి.
వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా నిజంగానే ఇలా జరిగింది.ఇది ఏదో దేశంలో జరిగింది కాదండోయ్.మన భారతదేశంలోనే ఉత్తర భారతంలోని ఉత్తర ప్రదేశ్‌లో ఈ మనిషి ఉన్నాడు.ఇతడికి గుండె ఎడమ వైపు కాకుండా కుడి వైపు ఉంది.
పుట్టి ఇన్నాళ్లయినా అతడి గుండె గురించిన ఎలాంటి అనుమానాలు రాలేదు.అసలు అతడు ఎందుకు తను అలా ఉన్నాను అనే విషయాన్ని గుర్తించలేక పోయాడు.
ఇటీవల విపరీతమైన కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కు వెళ్లాడు.అక్కడ అసలు విషయం తెలియడంతో డాక్టర్లు అవాక్కయ్యారు.
తన అవయవాల పరిస్థితి తెలిసి అతడు మరియు అతడి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఉత్తరప్రదేశ్ కుషినగర్‌కు చెందిన జమాలుద్దీన్ ఇటీవల కడుపు నొప్పితో తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్నాడు.కడుపు నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ వాడాడు.
కాని అతడి పెయిన్ కిల్లర్ పెయిన్‌ను తగ్గించలేక పోయింది.ఇక లాభంలేదనుకున్న అతడు గోరఖ్‌పూర్‌లోని ఒక హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు.
తీవ్రమైన కడుపు నొప్పితో జాయిన్ అయిన జమాలుద్దీన్‌ను వెంటనే వైధ్యులు ఎమర్జెన్సీ వార్డుకు తరలించి టెస్టులు చేశారు.

టెస్టులు చేసిన సమయంలో వారు ఆశ్చర్యపోతారు.అతడి గుండె కుడి వైపుకు మరియు కాలేయం కుడి వైపుకు ఉండాల్సింది పోయి ఎడమ వైపుకు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.కేవలం గుండె మరియు కాలేయం మాత్రమే కాకుండా చాలా బాగాలు కూడా నిర్ధిష్ట ప్రాంతంలో కాకుండా అటు ఇటుగా ఉన్నాయి.
అతడి శరీరంలోని పలు భాగాలు కుడి ఎడమయ్యాయి.ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన కేసుగా డాక్టర్లు నిర్ధారించారు.ఇప్పటి వరకు ఎవరికి ఇలా జరగలేదని డాక్టర్లు అంటున్నారు.
ఇలా ఉండటం వల్ల ప్రాణాలకు వచ్చే ప్రమాదం లేదు కాని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
జమాలుద్దీన్ గురించి ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు.అమెరికా వైధ్యులు ఆయన్ను పరీక్షించేందుకు ఏకంగా అమెరికాకు రావాల్సిందిగా కోరారు.







