ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం( Telugu country ) కు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారినట్టు కనిపిస్తున్నాయి.వరుస విజయాలు దక్కడంతోపాటు, పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు చోటు చేసుకోవడం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత ఈరోజు పార్టీలో చేరిపోతున్నారు.ఇటీవల వైసిపి అధిష్టానం పై తిరుగుబావుటా ఎగరవేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( MLA Kotamreddy Sridhar Reddy ) సోదరుడు గిరిధర్ రెడ్డి ఈరోజు టిడిపిలో చేరుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన గిరిధర్ రెడ్డిని( Giridhar Reddy ) ఇటీవల వైసిపి అధిష్టానం సస్పెండ్ చేసింది.పార్టీ నియమాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకే సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది.

ఈ క్రమంలోని గిరిధర్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరాలని మొదట్లో ప్రయత్నించినా .ఆ పార్టీ అధిష్టానం నుంచి అనుమతి రాలేదు.దీనికి కారణం ఆయన వైసీపీ నుంచి దూరం కాగానే తాను రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ స్వయంగా ప్రకటించుకోవడంపై .నెల్లూరు టిడిపి కీలక నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.శ్రీధర్ రెడ్డి కారణంగా తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఫిర్యాదు చేశారు .దీంతో శ్రీధర్ రెడ్డి చేరికకు బ్రేక్ పడింది .కానీ ఇప్పుడు శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని చేర్చుకునేందుకు చంద్రబాబు సముకత వ్యక్తం చేయడంతోనే ఆయన ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు టిడిపి కండువా కప్పుకోబోతున్నారు. నెల్లూరు నుంచి భారీ కార్ల కాన్వాయ్ తో మంగళగిరి( Mangalagiri ) కి గిరిధర్ రెడ్డి బయలుదేరారు.

దాదాపు 300 కార్లతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి అనుచరులు తరలివస్తున్నారు .నెల్లూరు లోని కస్తూరి గార్డెన్స్( Kasturi Gardens ) నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మంగళగిరి వరకు కొనసాగనుంది.టిడిపిలో చేరుతున్న సందర్భంగా ఆయన అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గిరిధర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.
గిరిధర్ రెడ్డి టిడిపిలో చేరిన తరువాత ఆయన సోదరుడు శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీ బాట పట్టే అవకాశం కనిపిస్తోంది.