దేశ రాజధాని లో మైనర్ బాలికపై స్కూల్ ప్యూన్ అత్యాచారం చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.సమాజంలో చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలకు గురవడం క్రమంగా పెరుగుతోంది.
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కఠిన శిక్షలు అమలుపరిచిన సమాజంలో మార్పు రావడం లేదు.పదేళ్ల మైనర్ బాలికపై 54 ఏళ్ల ప్యూన్ అత్యాచారం చేశాడంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) లోని జోన్పూర్ కు చెందిన అజయ్( Ajay ) (54) అనే కామాంధుడు, దేశ రాజధాని ఢిల్లీలో ఎంసీడీ స్కూల్ లో 10 సంవత్సరాలుగా ప్యూన్ గా పని చేస్తున్నాడు.స్కూల్లో చదివే పదేళ్ల మైనర్ బాలికపై కన్నేశాడు.
అవకాశం కోసం ఎదురుచూస్తూ, ఎవరూ లేని సమయంలో ఆ అమ్మాయిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చి తన సహచరులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ విషయం ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు తెలియడంతో మార్చి 14న స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు బాధిత బాలికకు ఎల్బీఎస్ వైద్య పరీక్షలు చేపించి, కౌన్సిలింగ్ ఇచ్చారు.గాజీపూర్ ( Ghazipur ) పోలీస్ స్టేషన్లో ఐపీసీ 363/328/376డి/506, పోక్సో చట్టం ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడు అజయ్ ను అరెస్టు చేశారు.అయితే అజయ్ తో పాటు అత్యాచారానికి పాల్పడిన సహచరులు పరారీలో ఉన్నారు.
పోలీసులు నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.దేశంలో ఇలాంటి కామాంధులకు నేరం రుజువైన వెంటనే కఠినంగా శిక్షిస్తే, ఇలాంటి దారుణాలు తగ్గే అవకాశం ఉంటుందని రాజధాని ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇటువంటి వారి వల్ల సమాజంలో ఆడవాళ్లకు రక్షణ కరువైందని, ప్రభుత్వం ఆడవారి రక్షణ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.







