బన్నీ కోసం ఆచార్యకు భారీ ఆఫర్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ‘అల వైకుంఠపురుములో’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.

ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ను నమోదు చేసుకున్న బన్నీ, తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

పుష్ప అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు.కాగా ఈ సినిమా తరువాత బన్నీ కొంత మంది డైరెక్టర్స్‌ను లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటికే వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఐకాన్ అనే సినిమాలో నటించేందుకు రెడీ అయిన బన్నీ, ఆ తరువాత సురేందర్ రెడ్డి, కొరటాల శివ, లింగుస్వామి వంటి డైరెక్టర్స్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.అయితే బన్నీతో సినిమా చేసేందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెడీ అవుతున్నాడు.

కాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు అరవింద్.ఈ సినిమాను బన్నీతో చేసేందుకు అరవింద్ ప్రణాళిక చేస్తున్నాడు.ఈ క్రమంలో కొరటాలకు ఈ సినిమా కోసం ఏకంగా రూ.13 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ను ఇచ్చేందుకు ఒప్పందం కూడా చేసుకున్నాడట.దీంతో కొరటాలతో బన్నీ సినిమా ఖచ్చితంగా ఉండబోతుందని తెలుస్తోంది.

Advertisement

మరి కొరటాల ఆచార్య సినిమా తరువాత ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరిలో ఆసక్తి మొదలైంది.ఇక పుష్ప సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌కు చుక్కలు చూపించేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ ముగియగానే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు