మేము హరీష్ వర్గమే ! కేసీఆర్ పై కొండా సురేఖ ఫైర్

టీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి ఇంకా చల్లారలేదు ! రోజు ఏదో ఒక చోట ఈ విషయంపై ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది.

ఇక తెలంగాణాలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు ఉన్న కొండా సురేఖ ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉంటూనే ఆ పార్టీ అధినేత ఆయన కొడుకు, కూతురిపైనా నిప్పులు చెరిగారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే ప్రజల లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.టీఆర్ఎస్ లో మేము హారీష్ రావు వర్గమని, అందుకే మాకు టికెట్లు ఇవ్వకుండా కేసీఆర్, కేటీఆర్ కుట్రలు చేసారని అన్నారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ పాలనపై, పాలనా వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క మహిళా మంత్రి లేకుండా పాలన సాగించిన ఏకైక సీఎం కేసీఆర్‌ అన్న కొండా సురేఖ ఇంతవరకు ఏ సమస్యను పరిష్కరించలేదన్నారు.ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేని అసమర్థ పాలన సాగించారని ప్రతీ పనిలో కేటీఆర్ ఎంత పర్సంటేజీ తీసుకున్నారో తనకు తెలుసని చెప్పుకొచ్చారు.తెలంగాణ కోసం హరికృష్ణ ఏం చేశారని స్థలం ఇచ్చారని ప్రశ్నించారు.

Advertisement

ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు రాకుండా ప్రజలకు కలవకుండా పాలించిన సీఎంగా కేసీఆర్‌ రికార్డ్‌ సృష్టించారని విమర్శించారు.అధికారం కోసం, స్వలాభం కోసం మేము ఏనాడు పార్టీలు మారలేదు.

మాకు కారణం చెప్పకుండా టిక్కెట్ ఇవ్వకుండా నమ్మకద్రోహం చేశారు.వేల కోట్ల అవినీతితో మీ ఖజానా నిండిపోయిందనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

కేవలం ప్రగతి భవన్, ఎర్రవల్లి ఫామ్ హౌజ్ పచ్చగా ఉంటే సరిపోతుందా.? బంగారు తెలంగాణ అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు చల్లగా ఉంటే సరిపోతుందా.? తెలంగాణ ఉద్యమకారుల ఉసురు, అమరవీరుల ఉసురు ఊరికేపోదు అంటూ శాపనార్ధాలు పెట్టారు.

ప్రగతి నివేదన సభ కోసం కోట్లు ఖర్చు పెట్టి లక్షల మందిని పిలిపించి ప్రజలకు తిండి, నీళ్లు లేకుండా ఇబ్బంది పెట్టారు.మీ కొడుకుని సీఎంను చేయడానికి తెలంగాణ కేసీఆర్ ఫామ్ హౌజ్ కాదు.ప్రజల్లో నుంచి వచ్చిన వారు నాయకులు అవుతారు.ప్రజల్లోకి చొచ్చిన వారు రాజకీయ నాయకులు కాదు అంటూ ఎద్దేవా చేశారు.105 మందికి టిక్కెట్లు ఇచ్చి హరీష్ రావుకు దగ్గరగా ఉండేవారి నియోజకవర్గాల్లో గొడవలు సృష్టించి టిక్కెట్ ఇవ్వలేదు.పర్సంటేజీలు వచ్చే ఫైళ్లను క్రీయర్ చేసి, మిగతావి పక్కన పెట్టారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

డిపార్ట్ మెంట్ల వారీగా పెండింట్ ఫైళ్ల వివరాలు బయటపెట్టాలి.ప్రతిపక్షాలు ఏకమైతే తప్పుపడుతున్న కేసీఆర్ రాజకీయాల కోసం బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం సబబా అంతో మండిపడ్డారు.

Advertisement

డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, స్కైవేలు, ఆకాశ హార్మ్యాలు, కొత్త సెక్రెటేరియట్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణం ఏమైంది అంటూ కేసీఆర్ ని ప్రశ్నించారు.

తాజా వార్తలు