కోలీవుడ్ టాప్ స్టార్ శింబు మరో సినిమాతో.జనాల ముందుకు వస్తున్నాడు.
ఆయన నటించిన లేటెస్ట్ మూవీ మానాడు. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్ మీట్ నిర్వహించాడు శింబు.అభిమానుల సమక్షంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం విశేషం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా అంటే చాలా తేడాగా అనిపించాయి.ఆయన ఏదో నర్మగర్భంగా చెప్పిన మాటలు సంచలనం కలిగిస్తున్నాయి.
మీరే జాగ్రత్తగా నన్ను చూసుకోవాలంటూ ఆయన చేసిన కామెంట్స్ ఏదో తెలియని విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
గడిచిన కొంత కాలంగా ఆయన చుట్టూ చాలా సమస్యలు వచ్చి పడుతున్నాయి.
దానికి కారణాలు ఏమైనప్పటికీ.ఆయన చాలా ఇబ్బందుల్లో మాత్రం ఉన్నాడు.
ఇప్పటికే ఆయనపై పలువురు ఫిర్యాదులు కూడా చేశారు.శింబు మూలంగా తమకు చాలా రకాలుగా నష్టం వాటింల్లిందని.
వెంటనే తమకు నష్ట పరిహారం అందించాలని పలువురు నిర్మాతలకు ఆయనపై ఫిర్యాదు చేశారు.ఫిల్మ్ చాంబర్ లో ప్రస్తుతం ఈ కేసు కొనసాగుతంది.
అయితే శింబుపై కొందరు కావాలనే చెడు ప్రచారం చేస్తున్నారని.ఆయనపై కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన తల్లిందండ్రులు, దర్శకులు రాజేందర్, ఉష రాజేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయంపై ఆయన అభిమానుల ముందు ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.ఈ సందర్భగా ప్రెస్ మీట్ మధ్యలోనే ఆయన కంట తడి పెట్టుకున్నాడు.

గత కొంత కాలంగా తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు ఆయన అభిమానులకు వెల్లడించాడు.అయితే ఆ సమస్యలను తాను చూసుకుంటానని చెప్పాడు.అయితే తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉందని ఆయన వెల్లడించాడు.ఆయన పిలుపుకు అభిమానులు గట్టి సంఘీభావం చెప్పారు.తమ అరుపులతో తనకు అండగా ఉంటామని ఫ్యాన్స్ వెల్లడించారు.ఎట్టి పరిస్థితుల్లో నీకు ఏమీ కానివ్వకుండా చూసుకుంటామని తేల్చి చెప్పారు.కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మాదంటూ శపథం చేశారు.