అతడు మనిషిగా పుట్టవల్సిన వాడు కాదు

తెలుగు దేశం పార్టీ ముఖ్యనేత దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల దేవినేని ఉమ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొడాలి నానిని బూతుల మంత్రిగా అభివర్ణించాడు.

దాంతో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన దేవినేని ఉమాను నాని తనదైన శైలిలో చీల్చి చెండాడే వ్యాఖ్యలు చేశాడు.తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ సంచలన వ్యాఖ్యలతో దేవినేని ఉమకు షాక్‌ ఇచ్చాడు.

దేవినేని అసలు మనిషిగా పుట్టవల్సిన వాడు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.దేవినేని ఉమ పదవి కోసం వదినను చంపేశాడు.

ఆయన గురించి అంతకంటే మాట్లాడటానికి ఏముంటుందంటూ ఆరోపించాడు.అతడికి ఉచ్చ నీచాలు ఏముంటాయి.

Advertisement

బ్రోకర్‌లు చేసే పనులన్నింటిని చేసిన ఘనుడు అతడు.అతడి దుర్మార్ఘపు పద్దతుల వల్ల ఎంతో మంది ఇబ్బందులకు గురయ్యారు.

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బ్రోకర్‌గా వ్యవహరించి సూట్‌ కేసులు మోసిన దేవినేని ఉమ ఇప్పుడు మా గురించి మాట్లాడే నైతికతను కలిగి ఉన్నాడా అంటూ నాని ప్రశ్నించాడు.గతంలో తను చేసినట్లుగా ఇప్పుడు మంత్రులు బ్రోకర్‌లుగా వ్యవహరిస్తున్నారని ఆయన అనుకుంటున్నాడు అంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Advertisement

తాజా వార్తలు