Guru Pushya Yog : గురు పుష్య నక్షత్ర యోగం రోజు.. తలపెట్టిన పనిలో విజయం కోసం ఇలా చేయండి..!

గురు పుష్య నక్షత్ర యోగం( Guru Pushya Nakshtra Yogam ) చాలా పవిత్రమైనది.గురువారం బృహస్పతికి అంకితం చేసే రోజు.

అలాగే వైద్య జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుపుష్య యోగం శుభప్రదమైనది .అలాగే అదృష్టకరమైనది.ఫిబ్రవరి నెలలో రెండోసారి గురు పుష్య యోగం వస్తుంది.

గురు పుష్య నక్షత్ర యోగం ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 5 గంటలకు మొదలయ్యి సాయంత్రం 4:44 గంటల వరకు ఉంటుంది.గురు పుష్య నక్షత్రం చాలా మంగళకరమైనది.

అందరికీ ప్రయోజనకరంగా కూడా ఉంటుంది.అయితే ఈ నక్షత్రం గురువారం రావడం వలన ఏ పనులు తలపెట్టినా కూడా బృహస్పతి( Brihaspati ) అనుగ్రహం లభిస్తుంది.

Advertisement

ఇక కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అత్యుత్తమ సమయం అని చెప్పవచ్చు.పూజా, కార్యక్రమాలు, శుభకార్యాలు, గృహప్రవేశాలు ఏవైనా కూడా చేపట్టవచ్చు.

కానీ వివాహ శుభకార్యాలకు మాత్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు.అలాగే ఈ సమయంలో ఏ పని తలపెట్టినా కూడా అందులో సంపూర్ణ విజయం లభిస్తుంది.

అలాగే ఈరోజు సర్వార్ధ సిద్ధియోగం, అమృత యోగం కూడా ఏర్పడనున్నాయి.జ్ఞానం, సంపద, అదృష్టం, ఆధ్యాత్మికం లాంటి వాటికి దేవ గురువు బృహస్పతి కారకుడిగా భావిస్తారు.

కాబట్టి గురు భగవానుడికి అనుగ్రహం ఉంటే శ్రేయస్సు, సంపద, ఆధ్యాత్మిక పురోగతి పొందుతారు.ఇక గురువారం( Thursday ) పుష్య నక్షత్రంతో బృహస్పతి కలవడం వలన విజయం, సంపద, జ్ఞానం, డబ్బులు లభిస్తాయి.అయితే గురు పుష్య నక్షత్ర యోగం రోజు విరాళాలు, దానధర్మాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
మీ వెన్నెముక బ‌లంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిందే!

కాబట్టి ఆకలితో ఉన్నవారికి ఆహారం, వస్త్రాలు దానం చేయాలి.అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి గురువు పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవాలి.

Advertisement

అలాగే విష్ణు ఆలయాన్ని( Maha Vishnu Temple ) సందర్శించాలి.

భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి.అలాగే ఆ రోజున బంగారం, వెండి, భూమి, భవనాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఏవైనా కొనుగోలు చేస్తే చాలా మంచిది.అలాగే అరటి మొక్కకు శనగపప్పు, బెల్లం, అరటి పండ్లు సమర్పించి పూజ చేయాలి.

ఇలా చేయడం వలన గురు పక్షం గురు పుష్య నక్షత్రం ఆధ్యాత్మిక ఔన్నత్యం, శ్రేయస్సు, వ్యక్తిగత, అభివృద్ధికి అవకాశాలు అందుతాయి.ఈ సమయంలో ఏ కారం తలపెట్టినా కూడా అందులో విజయం మీదే ఉంటుంది.

అలాగే గురు భగవానుడితో పాటు శని అనుగ్రహం కూడా పొందుతారు.

తాజా వార్తలు