బరువు తగ్గాలంటే .. వంటిట్లో ఈ జాగ్రత్తలు అవసరం

సాధారణంగా బరువు ఎందుకు పెరుగుతారు? సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వలన.ప్రతీరోజు బయటి ఆహారం తినరు కాబట్టి, పొరపాట్లు ఎక్కువగా వంటింట్లోనే జరుగుతున్నాయి.

ఆ తప్పులేంటంటే .* కొంతమంది ఒకసారి వంటలకు వాడిన నూనెను మరోసారి మరో వంటకానికి వాడుతూ ఉంటారు.ఇలా చేయడం మంచిది కాదు .ఎందుకంటే ఫ్రెష్ నూనెతో పోల్చుకుంటే, వాడిన నూనెలో ట్రాన్స్‌ ఫ్యాట్స్ ఎక్కువ.* పొద్దున్నే అల్పాహారాన్ని కూడా ఏ పూరితోనో, దోశతోనో కాకుండా, ఆవిరితో చేసిన ఇడ్లీ తో ప్రారంభించండి.

* బరువు తగ్గాలనుకునేవారు నూనెతో చేసే వంటకాలను ఎంత తక్కువ తింటే అంత మంచిది.అయితే నూనె తక్కువగా వాడే వంటలను చేసుకోండి, లేదా అయిల్ లెస్ ఫుడ్స్ మీద దృష్టిపెట్టండి.

* ఎలాంటి నూనె వాడాలో బాగా ఆలోచించండి.లో ఫ్యాట్స్ ఉన్న మంచినూనె వాడితే మంచిది.

Advertisement

* రుచి కోసం నెయ్యి, బట్టర్, చీజ్ లాంటివి వాడటం బాగానే అనిపించినా, ఇవి బరువు అస్సలు తగ్గనివ్వవు.కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మేలు.

* వంటల్లో ఉప్పు శాతం కూడా తక్కువగా ఉండేలా చూసుకోండి.ఉప్పుశాతం పెరిగిన కొద్ది శరీరంలోకి నీరు చేరి ఇంకా బరువు పెరుగుతారు.

* తీపి మీరనుకున్నంత తీపి ఏం కాదు.స్వీట్లు అవి ఇవి చేసుకుంటే తక్కువగా చేసుకోవాలి.

అలాగే షుగర్ తక్కువగా వాడే స్వీట్లు చేసుకోవాలి.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు