వామ్మో.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం..ఎందుకంటే?

పాము పేరు వింటేనే ఒంట్లో ఒణుకు మొదలవుతుంది.దూరంలో ఉండగా కనిపిస్తేనే పై ప్రాణాలు పైనే పోతాయి.

ఇక దగ్గరగా ఒక్క అడుగు దూరంలో పాము మనకు దర్శన మిస్తే.ఇక గుండె ఆగిపోవడం ఖాయం.

కానీ స్నేక్ క్యాచర్స్ మాత్రం ఎంతటి విషపూరితమైన, భయంకరమైన పాములను కూడా అవలీలగా పట్టుకుంటారు.కానీ ఇది మాములు విషయం అయితే కాదు.

వీళ్ళు కూడా పాములను పట్టుకునేటప్పుడు చాలా ప్రమాదాలు ఎదురవుతాయి.ఒక్కోసారి విషపూరితమైన పాముల వల్ల స్నేక్ క్యాచర్స్ ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది.

Advertisement

కానీ వీటన్నిటిని లెక్కచేయకుండా స్నేక్ క్యాచర్స్ మాత్రం ఎక్కడ పాము ఉందని సమాచారం అందిన కూడా వాటిని సురక్షితంగా పట్టుకుని అడవుల్లో విడిచి పెడుతుంటారు.ఇలా చాలా మంది స్నేక్ క్యాచర్స్ పాములను సురక్షితంగా కాపుతూనే ఉన్నారు.

అయితే తాజాగా ఈ వీడియో చుస్తే మాత్రం స్నేక్ క్యాచర్స్ ఎంత రిస్క్ చేసి పాములను పెట్టుకుంటారో అర్ధం అవుతుంది.కింగ్ కోబ్రా ఎంత బయంకరమైన పాము అని అందరికి తెలుసు.ఇంత భయంకరమైన పామును ఒక స్నేక్ క్యాచర్ పట్టుకోబోతే అతడిపై దాడి చేయబోయే ఘటనను వీడియో రూపంలో బయటకు రావడంతో ఈ వీడియో చూసి నెటిజెన్స్ వామ్మో అంటున్నారు.

ఒక స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడిపై దాడికి దిగింది.అతడు కొంచెం అలెర్ట్ గా లేకపోయినా అతడిని కాటేసేది.ఒక గదిలోకి వెళ్లిన కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు అతడు తోకను పట్టుకోగా అది అమాంతం బయటకు వచ్చి ఒక్కసారిగా అంత ఎత్తున పడగా విప్పి బుసలు కొడుతూ ఉంది.

దీనిని చుస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలూ కూడా తెలియజేయండి.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు