ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు సూత్రధారులు ఎవరో తేలాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు( V Hanumantha Rao ) అన్నారు.
ఖమ్మం పార్లమెంట్( Khammam Parliament ) నియోజకవర్గ సీటు తనకు ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పారు.
అయితే ఈ వ్యవహారంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వీహెచ్ తెలిపారు.అయితే తాను ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం హామీ ఇవ్వడం లేదని వీహెచ్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లిన ఆయన తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.