తెలుగులో యశోద సినిమాతో ఉన్ని ముకుందన్ ( Unni Mukundan )అభిమానులకు దగ్గరయ్యారు.జనతా గ్యారేజ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి మెప్పించిన ఉన్ని ముకుందన్ కు ఫ్యాన్స్ భారీ స్థాయిలోనే ఉన్నారు.
కొంతకాలం క్రితం ఉన్నిముకుందన్ నటించిన మాలికాపురం మూవీ( Malikapuram movie ) రిలీజ్ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.అయితే ఉన్నిముకుందన్ హీరోయిన్ అనుశ్రీతో డేటింగ్ లో ఉన్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.
ఉన్ని ముకుందన్, అనుశ్రీ( Anushree ) త్వరలో పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచారం గురించి ఉన్ని ముకుందన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ నెల 11వ తేదీన ఉన్ని ముకుందన్ నటించిన జై గణేష్ విడుదల కానుండగా ఈ మూవీ ప్రమోషన్స్ లో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
అనుశ్రీతో నేను ఒక సినిమా మాత్రమే చేయబోతున్నానని ఆయన తెలిపారు.
ఇండస్ట్రీలో ఇతర హీరోయిన్లతో ముడి పెడుతూ నాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని ఉన్ని ముకుందన్ పేర్కొన్నారు.గతంలో కూడా నేను డేటింగ్ లో ఉన్నానంటూ వార్తలు ప్రచారంలోకి రాగా ఆ హీరోయిన్లకు ఇప్పుడు పెళ్లైపోయిందని ఉన్ని ముకుందన్ అన్నారు. నాతో డేటింగ్ అంటూ ప్రచారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ పెళ్లి జరిగిందని త్వరలో అనుశ్రీకి కూడా పెళ్లి జరుగుతుందని ఆయన తెలిపారు.
ఉన్ని ముకుందన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.పరిమితంగానే పారితోషికం అందుకుంటున్న ఉన్ని ముకుందన్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.ఉన్నిముకుందన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఉన్ని ముకుందన్ తెలుగు సినిమాలలో కూడా నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ఉన్ని ముకుందన్ కు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.