సమాజంలో నైతిక న్యాయం అమలులోకి రావాలని ఖమ్మం జిల్లా జడ్జి డాక్టర్ టీ. శ్రీనివాస్ అన్నారు.

సమాజంలో నైతిక న్యాయం అమలులోకి రావాలని ఖమ్మం జిల్లా జడ్జి డాక్టర్ టీ.శ్రీనివాస్ అన్నారు.

ఖమ్మం నగరంలో న్యాయ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ర్యాలీని జిల్లా జడ్జి డాక్టర్ టీ.శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.ర్యాలీ ని ఉద్దేశించి జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రజలు నీతిగా ఉంటే న్యాయస్థానాల అవసరమే ఉండదని, తప్పు అని తెలిసి కూడా తప్పు చేయడం వల్లనే వివాదాలు తలెత్తుతున్నాయన్నారు.

బ్రూణ హత్యలు, వరకట్నం వంటి వాటికి నివారించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.కార్యక్రమంలో జిల్లా జడ్జితో బాటు, జిల్లా న్యాయసేవ సంస్థ సెక్రటరీ జావేద్ అహ్మద్ పాషా, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోళ్లపూడి రామారావు, ప్యానెల్ అడ్వకేట్స్, పలువురు న్యాయవాదులు, పారా లీగల్ సిబ్బంది, ఎన్ సి సి కెడేట్స్, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు