కేజీఎఫ్‌2 రికార్డ్‌ ను బ్రేక్‌ చేయడం రాధేశ్యామ్‌ కు సాధ్యమా?

కేజీఎఫ్‌ 2 టీజర్‌ సాధించిన ఘనత ఈమద్య కాలంలో సౌత్‌ సినిమా మరేదైనా సాధించేనా అంటే అనుమానమే అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం త్వరలో రాబోతున్న రాధే శ్యామ్‌ టీజర్‌ ఖచ్చితంగా బ్రేక్‌ చేయడం ఖాయం అంటూ ఉంటే, లేదు ఆర్‌ఆర్ఆర్‌ సినిమా ఆ రికార్డును బ్రేక్‌ చేసేందుకు సిద్దం అవుతుందని కొందరు అంటున్నారు.

మొత్తానికి కేజీఎఫ్‌ 2 యూట్యూబ్‌ రికార్డు ఇప్పుడు అందరిని ఊరిస్తుంది.

అతి తక్కువ సమయంలో వంద మిలియన్ ల వ్యూస్ తో పాటు భారీ లైక్స్ తో సరి కొత్త రికార్డు లను నమోదు చేయడం జరిగింది.ఈ విషయంలో ఇప్పటికే సరికొత్తగా చర్చ జరుగుతోంది.

కేజీఎఫ్‌ 2 రికార్డు ను రాధే శ్యామ్‌ బ్రేక్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.కేజీఎఫ్‌ అన్ని భాషలకు కలిపి ఒకే టీజర్ ను విడుదల చేయడం జరిగింది.

ఇక ప్రమోషన్‌ ను భారీ ఎత్తున చేయడంతో పాటు రికార్డు కోసం చాలా ప్రయత్నాలు చేశారు.వంద మిలియన్ ల వ్యూస్ విషయంలో రాధే శ్యామ్‌ పోటీ పడాల్సిందే అంటూ ప్రభాస్‌ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Advertisement

కాని యూవీ క్రియేషన్స్‌ వారు మాత్రం అందుకు పెద్దగా ఆసక్తగా ఉన్నట్లుగా అనిపించడం లేదు.కేజీఎఫ్‌ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో పాటు దానికి ఇది సీక్వెల్‌ అవ్వడం వల్ల కేజీఎఫ్‌ 2 కు భారీగా వ్యూస్‌ వచ్చాయి.

కాని రాధే శ్యామ్‌ సినిమా విషయం వేరు కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో రాధేశ్యామ్‌ యూనిట్‌ సభ్యులు ఎలాంటి హడావుడి లేకుండానే విడుదల చేయాలని భావిస్తున్నారు.

అయితే అన్ని భాషలకు కూడా ఒకే ఒక్క టీజర్‌ ను విడుదల చేయడం వల్ల ఏమైనా ఆ రికార్డు వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.కనుక ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా దుమ్ము రేపే విధంగా ఉంటుందని అంటున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

.

Advertisement

తాజా వార్తలు