Tonique Elite wine shop : టానిక్ ఎలైట్ వైన్ షాపు వ్యవహారంలో బయటకు కీలక విషయాలు

తెలంగాణలో టానిక్ ఎలైట్ వైన్ షాపు ( Tonique Elite wine shop )వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే.

ఈ షాపుల్లో నిర్వహించిన సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆరేళ్ల కాలంలో సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు.

మిగతా పది క్యూ బైటానిక్ వైన్ షాప్ లెక్కలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.కాగా 2016 లో టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం గతంలోని బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే టానిక్ ఎలైట్ వైన్ షాప్ కు ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ శాఖ దర్యాప్తు చేస్తోంది.గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తి ఆదేశాల మేరకు టానిక్ ఎలైట్ వైన్ షాప్ కు మినహాయింపులతో కూడిన జీవో విడుదల చేశారని అధికారులు గుర్తించారు.

Advertisement

ఈ నేపథ్యంలో దర్యాప్తు పూర్తయిన తరువాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)
Advertisement

తాజా వార్తలు