జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కులాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలను నిలువరించాలని తెలిపారు.
ఇందులో భాగంగానే కులాల మధ్య అంతరాలు తగ్గించి సఖ్యత పెంచేందుకు జనసేన కృషి చేస్తోందని వెల్లడించారు.తిరుపతిలో బలిజలు, యాదవుల మధ్య సఖ్యతను విచ్ఛిన్నం చేయాలని కొందరు అధికార పార్టీ నేతలు కుట్రలకు తెర తీశారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి ఈ కుట్రలను నిలువరించాలని సూచించారు.







