ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ప్రజల తిరగబడితే ఫలితం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు.ప్రజాస్వామ్యo సిగ్గుపడేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగినా ప్రజలు తమ పక్షానే నిలిచారన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని భావించి మూడు రాజధానులంటూ మోసాగించే యత్నం చేశారని మండిపడ్డారు.ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోతే మూడు రాజధానులకు ప్రజలు వ్యతిరేకంగా అనే భావన వ్యక్తమవుతుందని వైసీపీ నేతలే ప్రచారం చేశారన్నారు.
అభివృద్దే తమ నినాదం అని ఉత్తరాంధ్ర ప్రజలు చాటి చెప్పారని అన్నారు.విశాఖలో రూ.40 వేల కోట్ల భూములను వైసీపీ కొల్లగొట్టిందని తాము చూపిన ఆధారాలు ప్రజలు నమ్మి ఓటు వేశారని తెలిపారు.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అసంతృప్తి లో ఉన్న చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల కు తాజా పట్టభద్రుల ఫలితాలు చూసి అంతరాత్మప్రభోదానుసారం ఓటేయబోతున్నారని చెప్పారు.రేపు జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పట్టభద్రుల ఎన్నికలు సెమీఫైనల్‌గా భావిస్తున్నామన్నారు.
రేపు పులివెందుల కూడా గెలవబోతున్నామని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.







