కేరళ పోలీస్ శాఖ చొరవ .. ఎన్ఆర్ఐల కోసం స్పెషల్ హెల్ప్ లైన్

భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలను కలిగి ఉన్న రాష్ట్రాల్లో కేరళ( Kerala ) ఒకటి.

దశాబ్థాల నుంచి లక్షలాది మంది మలయాళీలు పలు దేశాల్లో స్థిరపడ్డారు.

ఎక్కువగా టీచింగ్, హెల్త్ కేర్ రంగాల్లో కేరళ వాసులు పలు దేశాల్లో సేవలందిస్తున్నారు.అక్కడి నుంచి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్‌కు అందజేస్తున్నారు.

విపత్కర పరిస్ధితుల్లోనూ దేశానికి కేరళ ఎన్ఆర్ఐలు( Kerala NRIs ) అండగా నిలిచిన సందర్భాల్లో ఎన్నో.ప్రవాస భారతీయుల ప్రాధాన్యత నేపథ్యంలో కేరళలో ఎవరు అధికారంలో వున్నా ఎన్ఆర్ఐల సంక్షేమానికి ఇంపార్టెన్స్ ఇస్తారు.

తాజాగా కేరళ పోలీసులు( Kerala Police ) నాన్ రెసిడెంట్ కేరళీయుల (ఎన్ఆర్‌కే) కోసం 24 గంటల టెలిఫోన్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు.ఎన్ఆర్‌కేల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలనే ప్రాథమిక లక్ష్యంతో ఇక్కడి పోలీస్ హెడ్ క్వార్టర్స్ ‌లోని ఎన్ఆర్ఐ సెల్‌లో హెల్ప్‌లైన్ ప్రారంభించారు.0471-2721547/2729685/2724890/2722768 టెలిఫోన్ నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఈ సేవను పొందవచ్చని పోలీస్ శాఖ పేర్కొంది.రాష్ట్రంలోని ఎన్ఆర్‌కేల కుటుంబాలు దేశంలోని వారికి, లేదా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదు చేయడానికి ఈ సేవను ఉపయోగించుకోవచ్చని ఎన్ఆర్ఐ సెల్‌లోని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Advertisement

వారు తమ ఫిర్యాదులను spnri.pol@kerala.gov.inకి ఈ మెయిల్ చేయొచ్చు.

ఎన్ఆర్ఐ సెల్ హెల్ప్‌లైన్‌కు( NRI Cell Helpline ) వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపుతారు.హోంమంత్రి రమేష్ చెన్నితాల( Ramesh Chennithala ) ఆదేశాల మేరకు ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు.

ఇది కాకుండా ఎన్ఆర్‌కేలు నేరుగా డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లను కూడా సంప్రదించవచ్చు.వారి టెలిఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు పోలీస్ శాఖ వెబ్‌సైట్‌లో ‘‘ www.keralapolice.org.

’’లో పొందుపరిచారు.ప్రభుత్వ నిర్ణయం పట్ల కేరళ ప్రజలు, ఎన్ఆర్ఐ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సిమెంట్ ఉంగరంతో గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసిన చైనీస్ వ్యక్తి..!
Advertisement

తాజా వార్తలు