వైసిపి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి( Mithun Reddy )ని ఈరోజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఇటీవల పుంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ తో సహా 13 మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరారు.
దీంతో పుంగనూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది .ఈ వ్యవహారంపై స్థానిక నేతలను కలిసేందుకు వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి పుంగనూరు వెళ్లే ప్రయత్నం చేయగా , అక్కడకు వెళ్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు మిథున్ రెడ్డిని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు.ఈ అరెస్ట్ వ్యవహారంపై మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారి ఆస్తులను ధ్వంసం చేస్తూ ఇళ్లను కూల్చివేస్తున్నారని, మావారిని పరామర్శించేందుకు వెళుతున్న తనను అడ్డుకుంటున్నారని, ఎంపీగా నాకు ఉన్న హక్కులను అడ్డుకుంటున్నారని మిథున్ రెడ్డి మండిపడ్డారు.
పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 శాతం మంది వైసీపీ( YCP )కి ఓటు వేశారని వీరందరి పైన దాడులు చేస్తారా అని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదు , ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాము .మీరు వెళ్లడానికి లేదు హౌస్ అరెస్టు చేస్తున్నామని నాకు నోటీస్ ఇచ్చారు. పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు .
నేను బిజెపి( BJP )లోకి వెళ్తున్నానని గత కొద్దిరోజులుగా బుద్ధిలేని వారు ప్రచారం చేస్తున్నారని మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు.చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్న, ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు.చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు అని చల్లా బాబుకు సలహా ఇస్తున్నాను.
పోలీసులపై దాడి చేసి చల్లా బాబు జైలుకు వెళ్లారు. నేను అరెస్టు కైనా , ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.