మరో ప్రేమోన్మాది పనికి బలైన యువతి

ప్రేమోన్మాద ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అయిపోయాయి.

ప్రేమ ను అంగీకరించలేదని,ప్రేమించి ఇప్పుడు వేరొకరితో క్లోజ్ గా ఉంటుంది అని,పెళ్ళికి ఒప్పుకోలేదని ఇలా పలు కారణాలు చూపుతూ యువతుల పై యువకులు దాడులకు తెగబడుతున్నారు.

ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా కేరళ లో చోటుచేసుకుంది.పెళ్లి ప్రతిపాదనకు నిరాకరించిందని 17 ఏళ్ల యువతిని ఆమె ప్రేమికుడు చంపేశాడు.

కేరళలోని ఎర్నాకుళం జిల్లా లో ఉన్న కక్కనాడ్ లో ఇంటర్ చదువుతున్న దేవికను పెళ్లి చేసుకుంటా నంటూ మిథున్ అనే యువకుడు వెంటపడుతున్నారు.ఈ క్రమంలో దేవిక వెళుతున్న ట్యూషన్ సెంటర్ కు వెళ్లి కూడా మరి గొడవ పడ్డాడు.

అంతేకాకుండా ఆ రోజు రాత్రి ఆ యువతి ఇంటికి కూడా వెళ్లి నానా హంగామా సృష్టించాడు.అయితే అతడి పద్దతి నచ్చక దేవిక తో పాటు ఆమె తల్లి దండ్రులు కూడా పెళ్ళికి నిరాకరించడం తో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

Advertisement

ఈ క్రమంలో మిథున్ కూడా మంటల్లో చిక్కుకోవడం తో దేవిక తో పాటు అతడు కూడా ప్రాణాలు కోల్పోగా,దేవిక తండ్రికి మాత్రం గాయాలు అయినట్లు తెలుస్తుంది.

వాస్త‌వానికి మిథున్ ప్ర‌వ‌ర్త‌న గురించి అమ్మాయి త‌ల్లితండ్రులు గ‌తంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేసినప్పటికీ అతడిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకుండా తల్లిదండ్రులకు కౌన్సింగ్ ఇచ్చి పంపించారు.అయినా కానీ మిథున్ మాత్రం త‌న వైఖ‌రిలో మార్పు చూప‌లేదు.దేవిక‌ను రెగ్యుల‌ర్‌గా ట్యూష‌న్ సెంట‌ర్ వ‌ద్ద వేధిస్తూనే వ‌చ్చాడు.

చివ‌ర‌కు ఆమె పెళ్లికి నిరాక‌రించ‌డంతో.భ‌గ్న హృద‌యంతో మిథున్ ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు