హీరోయిన్స్ అంతా ఎప్పుడు ఒకేలా ఉండటానికి ఇష్టపడరు.ముఖ్యంగా తమ కాస్ట్యూమ్ విషయంలో మాత్రం అస్సలు తగ్గరు.
నిత్యం ట్రెండీగా కనిపించాలి అని వచ్చిన కొత్త డిజైన్లను ధరిస్తూ ఉంటారు.ఇక అవి ఎలా ఉన్నా కూడా ట్రెండ్ అంటూ ఫాలో అవుతూ ఉంటారు.
అయితే కొన్ని కొన్ని సార్లు వాళ్ళ దుస్తువులు చూడటానికి డిఫరెంట్ గా అనిపించినా కూడా వాళ్లకు మాత్రం అది కొత్త ట్రెండ్ గా అనిపిస్తూ ఉంటుంది.చూసే వాళ్ళు మాత్రం బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
తాజాగా కీర్తి సురేష్ విషయంలో కూడా అదే ఎదురయ్యింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈమధ్య కీర్తి సురేష్ హాట్ హాట్ గా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపడేలా చేస్తుంది.ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకుంది.
ఇక ఈ బ్యూటీ తొలిసారిగా పైలెట్స్ అనే మలయాళం సినిమా ద్వారా బాలనటిగా వెండితెరపై అడుగు పెట్టగా.తరువాత తమిళ సినిమాలలో నటించింది.ఇక 2016లో నేను శైలజ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో తన పాత్రతో మాత్రం అందరిని ఫిదా చేసింది.ఇక ఆ తర్వాత నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో లీనమైపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.పైగా మంచి అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.
మహానటి సినిమా తర్వాత కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ లు సొంతం చేసుకుంది.
ఇక సర్కారు వారి పాటలో కూడా మంచి సక్సెస్ అందుకుంది కీర్తి.ఈ సినిమాల్లో ఏకంగా గ్లామర్ షో కూడా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఇక అప్పటినుంచి బాగా గ్లామర్ షో చేసుకుంటూ పోతుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండటంతో అక్కడ కూడా మంచి అభిమానం ఏర్పరచుకుంది.అందులో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
ఒకప్పుడు కీర్తి సురేష్ లుక్ ఎంతో హోమ్లీగా ఉండేది.అంతేకాకుండా ఎక్కువ ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తుండేది.
కానీ ఈ మధ్య గ్లామర్ ను పరిచయం చేసింది కీర్తి.కెరీర్ మొదట్లో చాలా బొద్దుగా కూడా ఉండేది.
ఇక అవకాశాల కోసం బాగా వర్కౌట్లు చేసి చాలా సన్నబడింది.నిజానికి బొద్దుగా ఉన్నప్పుడే కీర్తి సురేష్ చాలా అందంగా ఉండేది.
ఇక సన్నబడ్డాక మాత్రం బాగా గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది.ఇక వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక కలర్ ఫుల్ డ్రెస్ ను వేసుకుంది.
ఇక ఆ డ్రెస్ తో బాగా స్టిల్స్ ఇచ్చింది.అయితే ఆ డ్రస్ చూడటానికి అచ్చం టెంట్ లాగా అనిపించింది.
దీంతో ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ అంతా ఆ డ్రెస్ టెంట్ హౌస్ నుంచి పట్టుకొచ్చావా అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.మరి కొంతమంది ఓ పాత సినిమాలో ఇద్దరు కమెడియన్స్ సర్కస్ లో వేసుకునే డ్రెస్ లాగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతుంది.