టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.బాహుబలి తర్వాత అదే క్రేజ్ ని మైంటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం కల్కి 2898 ఏడీ, సలార్ 2 రాజా సాబ్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.
ఇవి కాకుండానే అతడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga)కాంబోలో రాబోతున్న స్పిరిట్ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చి చాలా రోజులే అవుతోన్నా.వీళ్లిద్దరూ వేరే వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం మొదలవలేదు.కానీ, ఈ చిత్రంపై అంచనాలు మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కించాలని ప్లాన్లు చేస్తున్నారు.వైల్డ్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న స్పిరిట్ మూవీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీతో తెరకెక్కుతున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే వెల్లడించారు.
త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడుతున్నట్లు కూడా తెలిపాడు.ఇక, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు వస్తున్నాయి.తాజాగా కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుందని తెలిసింది.ప్రభాస్ నటిస్తోన్న స్పిరిట్ లో హీరోయిన్‌గా ఎంతో మంది పేర్లను పరిశీలించారట.అయితే, ఇందులో కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారని తాజాగా తెలిసింది.ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టును సందీప్ రెడ్డి వంగా ఆమెకు చెప్పినట్లు సమాచారం.
ఇది బాగా నచ్చడంతో ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలిసింది.త్వరలోనే కీర్తి సురేష్‌పై ప్రకటన చేయబోతున్నారని టాక్.