CM KCR: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

మునుగోడు ఉప ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మీడియా సమావేశంలో బీజేపీపై మండిపడ్డారు.

దేశంలో ఇప్పటికే 8 ప్రభుత్వాలను కొల్లగోట్టిన బీజేపీ మరో నాలుగు ప్రభుత్వాలను కూల్చటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.దేశంలోనే అత్యున్నత స్థాయి వ్యక్తులు.

మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారు.ప్రలోభ పెట్టిన ముఠాను మా ఎమ్మెల్యేలు పట్టించారు.

వీళ్లంతా బీజేపీ పార్టీకి చెందిన వాళ్లు.ఒక్కొక్కల దగ్గర రెండు మూడు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి.

Advertisement

ఈవీఎంలు ఉన్నంతకాలం బీజేపీకి డోకా లేదని ఈ ముఠా సభ్యులు చెబుతున్నారు.రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆసన్నమైంది.మాకు దేశంలో తిరుగులేదు.

అనే ధీమా వారిది.మా ఎమ్మెల్యేలకు అనేక ఆఫర్లు ఇచ్చారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఉండే దేశంలో ఎన్నికలు ఎందుకు.? ఇంత డబ్బు ఎవరూ వీరికి సమకూరుస్తున్నారు అని ప్రశ్నించారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

అంతేకాకుండా ఈ ముఠా వెనకాల బిఎల్ సంతోష్, జేపీ నడ్డా, అమిత్ షా ఉన్నట్లు వాళ్లే చెబుతున్నారని ఆరోపించారు.దేశం ఎప్పుడు ప్రమాదంలో పడ్డ న్యాయవ్యవస్థే ఆదుకుంది.ఈ క్రమంలో ప్రజలకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం నిలబడేలా.ఈ అంశంపై దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలి.

Advertisement

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు కేసిఆర్ విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు