ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ సరికొత్త వ్యూహాం

జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ విస్తరణకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సరికొత్త వ్యూహాంతో ముందుకు వెళ్తున్నారు.

విశాఖ ఉక్కు అజెండాగా ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

బిడ్డింగ్ లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే రేపు జయేశ్ రంజన్ బృందం వెళ్లనుంది.

అయితే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్ధతు పలికిన విషయం తెలిసిందే.మరోవైపు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దంటూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

Advertisement

కాగా సింగరేణి ద్వారా బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననుంది.విశాఖ ఉక్కు బిడ్డింగ్ పై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈనెల 15 వరకు బిడ్ వేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు