వారి విష‌యంలో కేసీఆర్ తీరు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోందే..

పెద్ద నాయకుల మొదలు చిన్నా, చితక నాయకుల వరకు చాలా మంది ప్రెస్‌మీట్లు పెడుతూనే ఉంటారు.వారు మాట్లాడాల్సింది మాట్లాడిన తర్వాత క్రాస్ చెక్ కోసం ప్రశ్నలు అడిగేందుకు మీడియాకు అవకాశం ఇస్తారు.

 Kcr's Approach To Their Case Is Being Criticized.., Kcr, Ts Politics, Tr Sparty-TeluguStop.com

దీని వల్ల వారు మాట్లాడిన అంశంపై ఇంకా స్పష్టత వస్తుంది.కానీ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఇందుకు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది.

ప్రెస్‌మీట్ హాజరైన జర్నలిస్టులను నోరెత్తకుండా వాళ్లకే క్రాస్ క్వశ్చన్స్ వేస్తూ వారు వేసే ప్రశ్నలకు అడ్డుపడుతున్నట్టుగా అనిపిస్తుంది.

సీఎం కేసీఆర్ ఎప్పుడు మీటింగ్ పెట్టినా.

తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తారు.ఇక ప్రభుత్వం గొప్పల గురించి చెప్పాల్సినప్పుడు ఆయనలో కొంచెం ప్రశాంతత కనిపిస్తుంది.

ఇక విపక్షలపై దుమ్మెత్తేలా వ్యవహరించే టైం వస్తే నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తారు.ఎంతటి మాటనైనా అనడానికి వెనుకాడరు.

ఇటీవలే వరిధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.ఈ టైంలో ఓ మీడియా మిత్రులు ప్రశ్నలు అడితే ప్రయత్నం చేయగా అతనికే అడ్డుగా మాట్లాడారు సీఎం.

ఇదే కదా గతంలోనూ కరోనా టైంలో ప్రెస్ మీట్లు నిర్వహించినప్పుడు సైతం ఇలాగే వ్యవహరించారు.

Telugu Bandi Sanjay, Bjp, Press Meet, Tr Sy, Ts, Ts Potics-Telugu Political News

మీకేం తెలుసు? ఎవరు మీకు చెప్పింది? క్వశ్చన్ అడిగే పద్దతి ఇదేనా? అంటూ జర్నలిస్టుల పట్ల కాస్త అగౌరవంగా, కాస్త చిన్నబుచ్చేలా మాట్లాడుతున్నారు.జర్నలిస్టులు వాస్తవ పరిస్థితులకు సంబంధించిన ప్రశ్నలు అడగటం కామన్.అలాంటివి అడిగినప్పుడు వాటిని పరిశీలించారు.

అధికారులతో కలిసి ఆ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఆదేశాలివ్వాలి.ఆ సమస్యలను పరిష్కారం చూపాలి అంతే కానీ వాస్తవాలను తెలుసుకోకుండా ప్రశ్నల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలను పక్కన పడేసేలా సీఎం తీరు ఉందంటున్న విమర్శలు వస్తున్నాయి.

ఇలాగైతే వాస్తవాలను ఎలా తెలుసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.మరి ఇప్పటికైనా సీఎం తీరు మారుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube