ఇటు ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు, సొంత పార్టీలో లుకలుకలతో కేసీఆర్ ప్రజల్లో మరింత పలుచబడుతున్న పరిస్థితి ఉంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను కొన్ని నెరేవేర్చని కేసీఆర్ రెండో విడత గెలిచిన తరువాత గత హామీలను నెరేవేర్చలేకపోయిన కేసీఆర్, రెండో దఫాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కొంత ఆలస్యం చేస్తూ ఉండడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ హామీలనే ఆయుధంగా మలుచుకుంటూ ప్రజల్లో టీఆర్ఎస్ ను మరింత బలహీనపరిచే దిశగా అడుగులేస్తోంది.
ఇక ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత రాకముందే జాగ్రత్తపడాలని నిర్ణయించుకున్న కేసీఆర్ ఇక ఒక్కొక్క హామీని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది.
అదే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి ఇలా కొన్ని ప్రముఖ హామీలపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లు సమాచారం.
హామీలను నెరేవేర్చకపోతే ప్రజలోకి వెళ్లలేమని గ్రహించిన కేసీఆర్, ప్రజలకు వ్యతిరేక కలిగించే ప్రతి ఒక్క విషయం పై కేసీఆర్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ప్రతిపక్షాల వ్యూహాలకు ప్రతి వ్యూహం వేస్తూ టీఆర్ఎస్ పార్టీ తన బలాన్ని నిలుపుకునే దిశగా అడుగులేసే అవకాశం ఉంది.