కేసీఆర్ ఎవరిపై అయినా విమర్శలు చేయాలన్నా.ఢీ కొట్టాలన్నా ఎంత మాత్రం వెనక్కు తగ్గరు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి మోడీపై విమర్శలు చేయాలంటేనే భయపడుతోన్న పరిస్థితి.ఒక్క బెంగాల్ సీఎం మమతా లాంటి వాళ్లే కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో వ్యవహరిస్తున్నారు.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం లోపల ఎంత కోపం ఉన్నా మోడీ విషయంలో నిన్న మొన్నటి వరకు భరిస్తూ వచ్చారు.అయితే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తోన్న బీజేపీ కేసీఆర్‌ను వీలైనంతగా ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.
ఇక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంతో పాటు తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న సందేహం కేసీఆర్‌కు వచ్చేసింది.దీంతో కేసీఆర్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు.
మోడీతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతోన్న పరిస్థితే కనిపిస్తోంది.కేసీఆర్ తాజాగా మంత్రుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలే ఆయన కేంద్రంతో ఢీ కొట్టే విషయంలో స్ట్రాంగ్‌గా ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఇటీవల పార్లమెంటులో వ్యవసాయ, విద్యుత్ సంస్కరణల బిల్లుకు మద్దతు ఇవ్వాలని కేంద్రం నుంచి బలమైన ఒత్తిడి రావడంతో పాటు ఎంతో మంది ప్రముఖులతో కూడా చెప్పించారని కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం కేంద్రానికి కూడా కోపం తెప్పించిందట.
అందువల్లే మోడీ తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిందని కేసీఆర్ ఈ సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది.ఇక బీజేపీ తమ ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని కేసీఆర్ మండిపడినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే రాష్ట్రాలను తమ కంట్రల్లో పెట్టుకోవాలని కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలకు తెలంగాణలో కేసీఆర్ గండి కొడుతోన్న పరిస్థితే ఉంది.కేంద్రం చెపుతోన్నవన్నీ 99 శాతం అబద్ధాలే నని కేసీఆర్ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఏదేమైనా కేంద్రం నుంచి వస్తోన్న ఒత్తిళ్ల ఆవేదన కేసీఆర్ మాటల్లో స్పష్టమైంది.అందుకే నిన్నటి వరకు మోడీ విషయంలో వెనకా ముందు, ఆచితూచి మాట్లాడుతోన్న కేసీఆర్ ఇకపై మోడీ లేదు గీడీ లేదు.
కేంద్రంతో తాడోపేడో అన్నట్టుగానే ముందుకు వెళుతోన్న పరిస్థితి అయితే ఉంది.