ఏపీ, తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జగన్, కెసిఆర్ లు తనతో చేతులు కలపాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.ఈ రాష్ట్రాలు శ్రీలంకలా మారకుండా ఉండాలంటే, అప్పులు తీరాలంటే ప్రజాశాంతి పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు.
నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ తెలంగాణలో రాబోయేది ప్రజాశాంతి పార్టీ ప్రభుత్వం అని చెప్పారు.తాను తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతానని వెల్లడించారు.
ఏపీలో టీడీపీ, వైసీపీలు లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధాని నిర్మించలేకపోయారని మండిపడ్డారు.చంద్రబాబు, జగన్ బిజెపికి సరెండర్ అయిపోయారని విమర్శించారు.
తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని, దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పారు.పవన్ కళ్యాణ్ కి తాను అంటే చాలా గౌరవం అని, వంద సార్లు ప్రజాశాంతి పార్టీలోకి రమ్మని పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చానని కేఏ పాల్ అన్నారు….