ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలి..: శేజల్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్యపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఆరిజన్ డెయిరీ ప్రతినిధి శేజల్ తెలిపారు.

న్యాయం కోసం పోరాడుతుంటే కేసీఆర్ స్పందించడం లేదని వాపోయారు.

తెలంగాణలో ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని శేజల్ ఆరోపించారు.అందుకే సీబీఐని ఆశ్రయించామని తెలిపారు.

ఎమ్మెల్యే చిన్నయ్య ప్రభుత్వ భూమిని తమకు అమ్మడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.తమను కిడ్నాప్ చేసి ఆధారాలు తీసుకోవడమే కాకుండా తమపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు.

ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు.బెల్లింపల్లి పోలీసులు దొంగలకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Latest Latest News - Telugu News