జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా మంది కి లైఫ్ వచ్చింది అలాంటి వాళ్లలో అనసూయ రేష్మి సుడిగాలి సుధీర్ లు మొదటి వరసలో ఉంటారు ఇక వీళ్ళ తర్వాత ఇప్పుడు ఈ షో కి యాంకర్ గా సౌమ్య రావు( Sowmya Rao ) చేస్తున్న విషయం మనకు తెలిసిందే…అయితే ఈ అమ్మడు కూడా ఏమాత్రం తగ్గట్లేదు.ఈ భామ ఈటీవీలో వచ్చే శ్రీమంతుడు సీరియల్ తో పాపులర్ అయ్యింది…
అయితే ఈ కొత్త యాంకర్ రెమ్యూనరేషన్ ఎంత అంటూ ఓ వార్త సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.
తెలుస్తోన్న సమాచారం ప్రకారం సౌమ్య రావుకు రెమ్యూనరేషన్ ఎపిసోడ్ కి 60 వేలు ఇస్తున్నారట.అయితే ఆమె పెర్ఫార్మన్స్, మాట, ఆకట్టుకునే తీరును బట్టి పెంచుతామని హామీ ఇచ్చారట నిర్మాతలు.తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ రెమ్యూనరేషన్ రష్మీ-అనసూయల రెమ్యూనరేషన్ కంటే తక్కువేని టాక్…
మరోవైపు ఈ కొత్త యాంకర్ ఏమాత్రం అనసూయ( Anasuya ), రష్మిలను మరిపిస్తుందంటున్నారు కొందరు ఫ్యాన్స్…అయితే సౌమ్య రావు జబర్దస్త్ షో ద్వారా ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచేసుకున్నారు.ఇక ఈ క్రమంలోనే.ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నుంచి కాల్ అందుకున్నారట ఈ బ్యూటీ…
ఓ స్టార్ హీరో చేసే పాన్ ఇండియన్ సినిమాలో.కాస్త పేరున్న రోల్ చేసే.బంపర్ ఆఫర్ కొట్టేశారట.ఇప్పుడు ఇదే న్యూస్ బుల్లి తెర సర్కిల్లో తెగ వైరల్ అవుతోంది…ఇదే కనక నిజం అయితే అనసూయ లాగా సౌమ్య కూడా సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ అవుతుంది అనడం లో ఎంతమాత్రం సందేహం లేదు అందుకే తను ఈ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకోబోతుంది అని కూడా తెలుస్తుంది.
అయితే అది ఏ సినిమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది…
.