కేసీఆర్ క‌ళ్లు తెరిపించింది ష‌ర్మిలేన‌ట‌.. మ‌రీ ఇంత అవ‌స‌ర‌మా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన ష‌ర్మిల మొద‌టి నుంచి కాస్త స‌మ‌స్య‌ల మీదే మాట్లాడే ప్ర‌య‌త్న‌మే చేశారు.

కానీ ఎప్పుడైతే పార్టీ పెట్టిందో అప్పటి నుంచి సొంత ప్ర‌చారం మొద‌లు పెట్టారు.

కాక‌పోతే ఈ ప్ర‌చారం కాస్త ఓవ‌ర్‌గా అనిపించేలా ఉంది.ఎందుకంటే ఆమె చేసుకుంటున్న ప్ర‌చారం కాస్త హ‌ద్దులు దాటి పోతోంది.

అందుకే ఆమెను ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రీసెంట్ సీఎం కేసీఆర్ 50 వేల ఉద్యోగాల‌ను భ‌ర్త చేస్తామ‌ని, వాటికి నోటిఫికేష‌న్‌లు కూడా జారీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.కాగా ఇక్క‌డే షర్మిల అల‌ర్ట్ అయ్యి సెల్ఫ్ డ‌బ్బా కొట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Advertisement

కేసీఆర్ ఇలా నిరుద్యోగుల గురించి ఆలోచించి నోటిఫికేష‌న్ ఇవ్వ‌డానికి తానే కార‌ణంమంటూ ఈ క్రెడిట్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు వైఎస్ ష‌ర్మిల‌.తాను మొద‌టి నుంచి నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాన‌ని, తాను దీక్ష చేయడం సీఎం కేసీఆర్ క‌ళ్లు తెరిచి నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్స్ ఇవ్వ‌డానికి రెడీ అయ్యారంటూ ప్ర‌చారం మొద‌లెట్టేశారు.

ఉద్యోగ నోటిఫికేషన్ల మీద ష‌ర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ త‌న ఎఫెక్ట్ వ‌ల్ల‌నే కేసీఆర్ దిగొచ్చారంటూ చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.అంతే కాదు ఏకంగా కేసీఆర్ ను ఉద్యోగ నోటిఫికేష‌న్ ఇచ్చేలా చేసింది త‌మ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణనే నంటూ కాస్త ఓవ‌ర్‌గానే ప్రచారం చేసుకుంటున్నారు ఆమె.ఇక ఈమె ట్వీట్ చేయ‌డం ఆల‌స్యం నెటిజన్లు, ఇత‌ర స‌మాజిక కార్య‌క‌ర్త‌లు ఆమె ట్వీట్‌కు రీట్వీట్లు చేస్తూ షర్మిలను ఏకి పారేస్తున్నార‌నే చెప్పాలి.మ‌రీ ఇంత డ‌బ్బా అవ‌స‌ర‌మా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కేసీఆర్ ఎన్ని నిర‌స‌న‌లు ఏసినా ప‌ట్టించుకోవ‌డ‌ని, అలాంటిది మీరు ఒక్క దీక్ష చేయ‌గానే దిగొచ్చాడంటూ చెప్ప‌డం ఓవ‌ర్‌గా ఉందంటూ ఆడేసుకుంటున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు