అక్కడ కేసీఆర్ ఎంట్రీకి అడ్డం పడుతున్న హరీష్

టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం జరగబోతున్న ఎన్నికలు అన్ని ప్రతిష్టాత్మకం కావడంతో, కీలక నాయకులంతా ఎన్నికల్లో విజయం సాధించే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.

ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఇక్కడ అవకాశం దక్కకుండా చేయాలని చూస్తున్నారు.

ఇక్కడ గెలుపు సాధించడం ద్వారా, ప్రజలంతా టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఉన్నారని, ప్రతిపక్షాలకు అవకాశమే లేదని, 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తప్పదు అనే సంకేతాలను ఇచ్చేందుకు టీఆర్ఎస్ తమ శక్తికి మించి కష్టపడుతున్నారు.ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉండడంతో, బీజేపీ పస్తుతం టీఆర్ఎస్ కు రాజకీయ ప్రత్యర్థిగా ఉంది.

స్వయంగా కేసిఆర్ చేయించిన వివిధ సర్వేలలోనూ, బీజేపీ పోటీ ఇస్తుందనే రిపోర్టులు రావడం తో ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు.ప్రజలను ఆకట్టుకునే విధంగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత విజయం కోసం కృషి చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వస్తున్నారని, ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం ఇక్కడి వ్యవహారాలను టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత గెలుపు కోసం హరీష్ రావు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ అభ్యర్థి విజయం సాధించే విధంగా అన్ని తానే ముందుకు నడిపిస్తూ, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ఈ విషయంపై దృష్టి పెట్టారు.ఇదిలా ఉంటే దుబ్బాక లో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దిగాల్సిన అవసరం లేదని, ఇక్కడ అభ్యర్థిని గెలిపించి తన సత్తా చాటుకుంటా అన్నట్లుగా హరీష్ రావు టీఆర్ఎస్ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో ఇప్పటివరకు కేసీఆర్ ప్రచారానికి వస్తారని, ప్రచారం జరిగినా, ఆ అవకాశమే కనిపించడం లేదు.

 అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ సైతం దుబ్బాక ఎన్నికల ప్రచారానికి దిగుతారని ముందుగా భావించినా, ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం కనిపించడం లేదు.పూర్తిగా హరీష్ ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి విజయమైనా, ఓటమైనా అన్నీ హరీష్ మీదే భారం వేసినట్టుగా ఇక్కడ పరిస్థితి ఉంది.

లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!
Advertisement

తాజా వార్తలు