ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌ ప్రకటించిన వరాలు

ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడిని రేపటి నుండి వచ్చి డ్యూటీలో జాయిన్‌ అవ్వాలంటూ కేసీఆర్‌ ప్రకటించాడు.49 వేల మందిలో 20 వేల మందిని ఉద్యోగాల నుండి తొలగించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

కొన్ని రూట్లను ప్రైవేటీకరణ చేసేందుకు కూడా చర్చ జరిగింది.

కాని అవేవి నిజం కాదని అందరు కూడా డ్యూటీలో జాయిన్‌ అవ్వవచ్చు అని, అలాగే రూట్లను ప్రైవేటీకరణ చేయడం కూడా నిజం కాదని, దాన్ని కూడా ఆర్టీసీ కార్మికుల కోసమే చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.ఇక ఆర్టీసీకి ఇప్పటికిప్పుడు ఆదుకునేందుకు వంద కోట్లు ఇస్తున్నట్లుగా ప్రకటించాడు.

అలాగే చార్జీలు పెంచేందుకు కూడా అనుమతిస్తున్నట్లుగా ప్రకటించాడు.చార్జీలు పెంచడంతో సంవత్సరంకు 750 కోట్ల వరకు ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందని అన్నాడు.

ఇక సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు సాయం చేసేందుకు ముందుకు వస్తాం అన్నారు.కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో కాని ప్రభుత్వంలో కాని ఉద్యోగం ఇస్తామంటూ హామీ ఇచ్చాడు.

Advertisement

ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు వచ్చే బాధ్యత నాది, నా మాట వింటే ప్రతి సంవత్సరం 50 వేల వరకు బోనస్‌ కూడా తీసుకునేలా నేను చేస్తానంటూ కేసీఆర్‌ హామీ ఇచ్చాడు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు