ఆ జిల్లాపై కేసీఆర్ అంత ఫోకస్ పెట్టడం వెనుక కారణం ఏంటి ?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలు ఒకపట్టిన ఎవరికీ అర్ధం కాదు.ఆయన ఎప్పుడు ఏం చేసినా, దానికంటూ ఓ లెక్క ఉంటుంది.

ఆషామాషీగా ఏ నిర్ణయం తీసుకోడు అనే సంగతి అందరికి బాగా తెలుసు.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్, టీఆర్ఎస్ హవాకు ఎటువంటి ఢోకా లేకపోయినా కేసీఆర్ మాత్రం ముందు జాగ్రత్తగా అన్నిరకాల చర్యలు తీసుకుంటూ ఉంటారు.

తాజాగా తెలంగాణాలో ఓ జిల్లాల్లో కేసీఆర్ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.ఇప్పటి వరకు తెలంగాణాలో కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి చెందిన నిజామాబాద్ జిల్లాపై టీఆర్ఎస్ ప్రభుత్వం అంతగా దృష్టిసారించలేదనే చెప్పాలి.

అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణలోని ఓ జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు టీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

Advertisement

ఎంపీగా పోటీ చేసిన కవిత ఓటమి చెందడం కవిత మాత్రమే కాకుండా టీఆర్ఎస్ శ్రేణులు ఎవరికీ మింగుడుపడని అంశంగా మారింది.ఇప్పటి నుంచి ఆ జిల్లాలపై పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో బీజేపీ బాగా బలపడుతోంది అన్న అనుమానం కేసీఆర్ లో కలిగింది.అందుకే ఇప్పుడు బీజేపీ దూకుడు అడ్డుకునే విధంగా కేసీఆర్ ఫోకస్ పెంచినట్టు కనిపిస్తోంది.

కవితపై ఎంపీగా గెలుపొందిన బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ జిల్లాలో పార్టీ బలోపేతానికి గట్టిగా కృషి చేశారు.ఈ క్రమంలోనే నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజపీ 28 కార్పొరేటర్లను గెలుచుకోవడం టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చినట్టు అయ్యింది.

అయితే నిజామాబాద్‌లో ఎంఐఎంతో కలిసి మేయర్ స్థానాన్ని దక్కించుకున్న టీఆర్ఎస్ తాజాగా నిజామాబాద్ జిల్లాపై పూర్తిగా ఫోకస్ పెంచింది.

దీనికోసం స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.రాజ్యసభ సభ్యుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేశ్ రెడ్డికి అవకాశం కల్పించడం వెనుక కారణాలు కూడా ఇదేనని తెలుస్తోంది.అంతేకాకుండా కేసీఆర్ కుమార్తె కవితను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఎమ్యెల్సీ గా బరిలోకి దించడం వెనుక కారణం కూడా ఇదేనని తెలుస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

ఏదో ఒకరకంగా నిజామాబాద్ లో టీఆర్ఎస్ పట్టు పెంచాలని, బీజేపీ ఈ జిల్లాలో పట్టు సాధించకుండా చూడాలని కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు