తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన రాజకీయ వ్యూహకర్త లేరనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉన్నా ఇప్పటికే అనధికారికంగా ఎన్నికల వాతావరణం నెలకొంది.
అయితే ప్రస్తుతం కేంద్రంలో మోడీనే టార్గెట్ గా విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే మోడీకి వ్యతిరేకంగా చేస్తున్న విమర్శలు దేశ వ్యాప్తంగా చర్చగా మారాయి.
అయితే ఎన్నడూ లేనంతగా మోడీని ఇంత అకస్మాత్తుగా టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని ఎవరికి నచ్చిన రీతిలో వారు విశ్లేశిస్తున్నారు.అయితే ఇటు దేశ వ్యాప్తంగా మోడీని విమర్శించడం ద్వారా రాష్ట్ర ప్రజల చూపు దేశ వ్యాప్త బీజేపీపై పడుతుంది.
కాని రాష్ట్ర బీజేపీ పై పడదు.
అదే ఇప్పుడు కేసీఆర్ వేస్తున్న వ్యూహంలా అనిపిస్తోంది.
అయితే రానున్న రోజుల్లో బీజేపీకి దేశ వ్యాప్తంగా ప్రత్యామ్నాయ బలమైన రాజకీయ పార్టీ ఏదీ లేని పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కూడా బలపడే అవకాశం ఎంత మేరకు లేకపోవడంతో ఆ అవకాశాన్ని కెసీఆర్ దక్కించుకోవాలని ఎంతో కొంత ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇది అంత సులభం కాకపోయినా రాష్ట్ర బీజేపీకి మాత్రం తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది.ఎందుకంటే దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేక వాతావరణం పెంచాలి అనే వ్యూహంతో పావులు కదిపే అవకాశం ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టంతా కెసీఆర్ పై పడింది.అయితే ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ కెసీఆర్ పై కూడా అదే రీతిలో విమర్శలు చేస్తున్నారు.
అయితే కెసీఆర్ ఒక్కసారిగా మోడీ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడంతో ఇక కెసీఆర్ పై ఇప్పటివరకు చేసిన వ్యక్తిగత కామెంట్స్ కాకుండా బీజేపీని తెలంగాణలో కాపాడుకునే పనిలో బీజేపీ నేతలు నిమగ్నమై ఉన్న పరిస్థితి ఉంది.