నరేష్ పవిత్ర లోకేష్ పై బోల్డ్ కామెంట్ చేసిన కార్తీకదీపం సౌందర్య?

నరేష్ (Naresh) పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ అవుతున్న పేర్లనీ చెప్పాలి.

వీరిద్దరి వ్యక్తిగతంగా రిలేషన్ లో ఉండటమే కాకుండా ఇద్దరు కలిసి జంటగా మళ్లీ పెళ్లి ( Malli Pelli)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి.ఇలా మళ్లీ పెళ్లి సినిమా ద్వారా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఈ జంట గురించి ఎంతోమంది ఎన్నో విమర్శలు చేస్తున్నారు.

అయితే వీరిద్దరూ మాత్రం వాటిని ఏమాత్రం లెక్క చేయలేదని చెప్పాలి.

లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్న నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు చట్టా పట్టాలేసుకొని ఇంటర్వ్యూలకు హాజరవడం స్టేజ్ పైన భారీ స్థాయిలో రొమాన్స్ చేస్తూ ఆటపాటలతో సందడి చేస్తున్నారు.అయితే ఇలా వీరి వ్యవహార శైలి చూసిన వారందరూ కూడా వీరిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.అయితే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ జంట గురించి కార్తీకదీపం(Karthika Deepam) సీరియల్ నటి సౌందర్య(Soundarya) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి నటి అర్చన సౌందర్య పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.తాజాగా ఈమె నరేష్ పవిత్ర లోకేష్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా రిలేషన్ లో ఉండడం పట్ల చాలామంది వీరి రిలేషన్ ను తప్పుపట్టారు.అయితే వీరి రిలేషన్ గురించి మాట్లాడుతూ నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరికి ఇష్టంతోనే వారు రిలేషన్ లో ఉన్నారని, వీరి రిలేషన్ ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని చివరికి తల్లిదండ్రులకు కూడా ఆ హక్కు ఉండదు అంటూ ఈ సందర్భంగా సౌందర్య నరేష్ పవిత్ర లోకేష్ జంట గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే సౌందర్య ఇలాంటి కామెంట్స్ చేయడంతో పలువురు సౌందర్య పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు