కష్టం ఒకరిది.. ఫలితం ఇంకొకరికి ?

” కష్టం ఒకరిది ఫలితం ఇంకొకరికి.” ప్రస్తుతం టి కాంగ్రెస్( Telangana congress) లో జరుగుతున్నా చర్చంతా ఇదే పాయింట్ చుట్టూ తిరుగుతోంది.ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో కష్టపడిన డికె శివకుమార్ ను కాదని సిద్దరామయ్య కే అధిష్టానం సి‌ఎం పదవి కట్టబెట్టింది.ఆ రకంగా చూస్తే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇదే విధానాన్ని అమలు చేస్తుందా అనే డౌట్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది.

 Competition For Cm Candidate In Congress Party? , Cm Candidate , Ts Politics , R-TeluguStop.com

కర్నాటక విజయం తరువాత టి కాంగ్రెస్ నేతల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది.అంతకుముందు సైలెంట్ గా పార్టీకి అంటి అంటనట్టుగా వ్యవహరిస్తున్న నేతలు సైతం ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు.

సిఎల్పీ మాజీ నేత జానా రెడ్డి( Jana Reddy ), పొన్నాల లక్ష్మయ్య వంటివారు మొన్నటివరకు పార్టీ కాయకలపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

Telugu Cm Candi, Congress, Komativenkat, Kranataka, Revanth Reddy, Telangana-Pol

ఇప్పుడేమో తరచూ గాంధీ భవన్ లో దర్శననమిస్తున్నారు.ఇక పార్టీలో ఉంటూనే ఆదిపత్యం కోసం పావులు కదిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంటి వారు సైతం ఇప్పుడు అత్యంత చురుకుగా పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు.అయితే నేతలంతా ఇలా యాక్టివ్ కావడానికి మెయిన్ రీజన్ సి‌ఎం కుర్చీనే అనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్న సీనియర్ నేతలంతా సి‌ఎం చైర్ కోసం ఇప్పటి నుంచే ఆశగా ఎదురు చూస్తున్నారట.పార్టీలో ఎవరెంత కష్ట పడ్డారనే విషయం పక్కన పెడితే సీనియారిటీని బట్టి అధిష్టానం సి‌ఎం పదవి అప్పగిస్తుందని సీనియర్స్ అంతా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Cm Candi, Congress, Komativenkat, Kranataka, Revanth Reddy, Telangana-Pol

అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ), భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వాళ్ళు సి‌ఎం పదవి పై ఇప్పటి నుంచే పెదవి విప్పుతున్నారు.ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు.హస్తం హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) విషయంలో సంతృప్తిగానే ఉంది.దీంతో సి‌ఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఉంటారని భావించడానికి లేదు.ఎందుకంటే కర్నాటకలో జరిగిన పరిణామలే అందుకు ఉదాహరణ.అందుకే సీనియర్ నేతలంతా అధిష్టానం దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డికి లభిస్తున్న ఆధారణ చూస్తే సీనియర్స్ ఎంత కష్టపడిన ఫలితం రేవంత్ రెడ్డికే వెళుతుందనే భావన కూడా కొందరి నేతలలో ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో సి‌ఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఎలా ఉండబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube