‘డ్రీమర్ల’ మెడపై బహిష్కరణ కత్తి : అమెరికా చిల్డ్రన్ యాక్ట్‌‌కు మద్ధతివ్వాలంటూ యూఎస్ క్యాపిటల్‌ ముట్టడి

అమెరికాలో( America ) గణనీయమైన సంఖ్యలో వున్న ఇండో అమెరికన్ డ్రీమర్లు( Indian Americans ) తమ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలకాలని చూస్తున్నారు.డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌గా( Documented Dreamers ) పిలిచే ఈ దీర్ఘకాలిక వీసా హోల్డర్ల సమూహం మరోసారి యూఎస్ క్యాపిటల్‌ను( US Capitol ) ముట్టడించింది.

 Documented Dreamers Urge Us Lawmakers To Pass America Children Act Details, Docu-TeluguStop.com

ఇటీవల ప్రవేశపెట్టిన ‘America’s Children Act’ నేపథ్యంలో తమకు మద్ధతుగా వుండాలంటూ వీరు చట్టసభల తలుపులు తట్టారు.ఈ సందర్భంగా ఈ డ్రీమర్స్‌ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ‘‘ఇంప్రూవ్ ది డ్రీమ్’’ వ్యవస్థాపకుడు దీప్ పటేల్ మాట్లాడుతూ.2,50,000 మంది డ్రీమర్స్‌లో 90 శాతం మంది STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్) కెరీర్‌లను అభ్యసిస్తున్నారని తెలిపారు .

2005లో ఉపాధి నిమిత్తం అమెరికాకు వచ్చిన తన తల్లిదండ్రులు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారని దీప్ పటేల్ గుర్తుచేసుకున్నారు.నాటి నుంచి తాము అమెరికాను ఇంటిగా చేసుకున్నట్లు తెలిపారు.ఈ దేశం తనను పెంచింది, చదివించింది, ఇంతటివాడిగా చేసిందని చెప్పారు.రెండు దశాబ్ధాలుగా ఇక్కడ చట్టబద్ధంగా నివసించిన తర్వాత తన తల్లిదండ్రులు కానీ, తాను కానీ ఇంకా శాశ్వత నివాస హోదాను పొందలేదని దీప్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈరోజు ఇక్కడికి వచ్చిన వారంతా తనలాంటి వారేనని.

వ్యవస్థలోని చిన్న లోపం కారణంగా తమకు 21 ఏళ్లు నిండిన తర్వాత దేశాన్ని విడిచి వెళ్లాలని బలవంతం చేస్తున్నారని దీప్ దుయ్యబట్టారు.

Telugu America, Dip Patel, Dreamers, Improve Dream, Capitol, Lawmakers, Visa, Us

మరో డ్రీమర్ 24 ఏళ్ల ముహిల్ రవిచంద్రన్ మాట్లాడుతూ.దాదాపు రెండు దశాబ్ధాలుగా తమ ఇంటిగా భావిస్తున్న అమెరికా నుంచి తాము బహిష్కరణకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.తన కుటుంబానికి ఇప్పటికే గ్రీన్ కార్డులు రావడంతో.

వారిని ఇక్కడే వదిలేసి తాను మాత్రం దేశాన్ని వదిలి వెళ్లాలా అని ముహిల్ ప్రశ్నించంది.గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ కారణంగా.తన తల్లిదండ్రులకు గ్రీన్‌కార్డ్ వచ్చే నాటికి తన వయసు దాటిపోయిందని, ఇప్పుడు తన భవిష్యత్తు అగమ్యగోచరంగా వుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

వివాదం నేపథ్యం ఇది:

Telugu America, Dip Patel, Dreamers, Improve Dream, Capitol, Lawmakers, Visa, Us

అమెరికాలో హెచ్‌–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్‌–ఇమ్మిగ్రెంట్‌ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్‌’లుగా పిలుస్తారు.ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు.అప్పుడు వారు అగ్రరాజ్యాన్ని వదిలి స్వదేశాలకు వెళ్లాల్సి వుంటుంది.

ఇలాంటి వారు అమెరికాలో దాదాపు 2,50,000 మంది వరకు వుంటారని అంచనా.

భారీసంఖ్యలో డ్రీమర్ల తల్లిదండ్రులు దశాబ్దాలుగా ‘గ్రీన్‌ కార్డు’ కోసం నిరీక్షిస్తున్నారు.

ఈ సమయంలో వారి పిల్లల వయసు 21 ఏళ్లు దాటుతోంది.దీంతో అలాంటి వారు అమెరికాను వీడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.డ్రీమర్లు 21 ఏళ్ల వయసులోపు వరకూ డిపెండెంట్‌లుగా తమ తల్లిదండ్రులతోపాటే అమెరికాలోనే ఉండొచ్చు.21 ఏళ్లు దాటితే వారికి ఆ డిపెండెంట్‌ హోదా పోతుంది.వారిలో ఎక్కువ మంది తల్లిదండ్రులతో కలిసి చిన్నారులుగా అగ్రరాజ్యం వచ్చిన భారతీయులే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube