యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీ ( Karti ) ఎప్పుడు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు.మరి ఈసారి కూడా మరో డిఫరెంట్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ దీపావళి కానుకగా కార్తీ మరో సినిమాతో ఆకట్టు కోవడానికి థియేటర్స్ కు రాబోతున్నాడు.
కార్తీ ఏ సినిమా చేసిన తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది.
ఎందుకంటే కార్తీ డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేయడంతో తెలుగులో కూడా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు.ఇక కార్తీ ప్రజెంట్ యంగ్ డైరెక్టర్ రాజు మురుగన్ ( Director Raju Murugan ) తో ”జపాన్” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో కార్తీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్( Anu Emmanuel ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను( Japan Movie Trailer ) రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండడంతో ఫ్యాన్స్ కు ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగి పోయాయి.
నిన్న చెన్నై నెహ్రు ఇండోర్ స్టేడియంలో ఆడియో లాంచ్ గ్రాండ్ గా జరుగగా ఈ ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ లో కార్తీ అతి పెద్ద గజదొంగ జపాన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.ఇక జపాన్ గా కార్తీ డైలాగ్ డెలివరీ, ఫైట్స్, యాక్టింగ్ అన్ని కూడా ఆకట్టుకున్నాయి.దీంతో ట్రైలర్ అదిరింది అనే చెప్పాలి.ఇక ఈ సినిమాకు డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తుండగా జివి ప్రకాష్ సంగీతమే అందిస్తున్నాడు.మరి జపాన్ సినిమాతో కార్తీ ఎలాంటి హిట్ అందుకుంటాడా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.