'ఓజి' విషయంలో త్రివిక్రమ్ పై అరిచిన పవన్.. అందుకేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సినిమాలు సినిమాలే.రాజకీయాలు రాజకీయాలే.

 Trivikram Being Scolded By Pawan Kalyan In The Matter Of Og, Director Sujeeth, O-TeluguStop.com

అన్నట్టు ముందుకు వెళుతున్నారు.సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే అవసరం అయినప్పుడు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు.

మరి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న మూవీ ”ఓజి” ( OG ).ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.మొదటి 50 శాతం షూటింగ్ చాలా ఫాస్ట్ గా పూర్తి కాగా ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో స్లోగా జరుగుతుంది.

Telugu Sujeeth, Og, Pawan Kalyan, Priyanka Mohan, Thaman, Trivikram-Movie

ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.ఇప్పటికే వచ్చిన టీజర్ నెక్స్ట్ లెవల్లో ఆకట్టుకుని అంచనాలను పెంచేసింది.యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ( Director Sujeeth ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్( Priyanka Mohan ) గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ( Trivikram ) కు గట్టి వార్ణింగ్ ఇచ్చారని టాక్.ఈ మధ్య కాలంలో పవన్ చేస్తున్న ప్రతీ సినిమాలో త్రివిక్రమ్ ఇంవోల్వ్ మెంట్ ఖచ్చితంగా ఉంటుంది.

బ్రో దెబ్బతో పవర్ స్టార్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ అంటే మండిపడుతున్నారు.ఈయన అనవసరమైన జోక్యం వల్లనే డైరెక్టర్స్ సినిమాను పెర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయలేక పోతున్నారని అంటున్నారు.

Telugu Sujeeth, Og, Pawan Kalyan, Priyanka Mohan, Thaman, Trivikram-Movie

అయితే ఓజి సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ కాస్త అతిగానే జోక్యం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.సుజీత్ కు ఇష్టం లేకుండానే ఒకటి రెండు మార్పులు చెప్పినట్టు తెలుస్తుంది.అలాగే ఒక ఎపిసోడ్ షూట్ అయిపోయాక మళ్ళీ దాన్ని మార్చి షూట్ చేయాల్సి వస్తుందని టీమ్ నుండి సమాచారం అందుతుంది.

ఇలా ప్రతీ విషయంలో త్రివిక్రమ్ జోక్యం వల్ల సుజీత్ కూడా ప్రెజర్ లో ఉన్నాడని టాక్.

ఇదే విషయంలో పవన్ త్రివిక్రమ్ మీద అరిచినట్టు తెలుస్తుంది.ఆల్రెడీ షూట్ చేసింది తీయడం కరెక్ట్ కాదని ఏదైనా ఉంటే ముందే స్క్రిప్ట్ దశలో ఉండగానే చెప్పాలని ఇప్పుడు ఇలా చెప్పడం కరెక్ట్ కాదని పవన్ అరిచినట్టు ఫిలిం సర్కిల్స్ లో ఒక వార్త వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube