సంచలన నిర్ణయం తీసుకున్న కరణ్ జోహార్... అందరిని అన్ ఫాలో చేసేసాడు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో చాలా మంది ఇండస్ట్రీలో మాఫియా గురించి, కొత్త వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్న వారు అంటూ కొంత మందిని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.

అందులో ముందు వరుసలో వినిపించే పేరు కరణ్ జోహార్.

అతనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి పరోక్ష కారణం అంటూ విమర్శిస్తున్నారు.సుశాంత్ కి అవకాశాలు రాకుండా బ్యాన్ చేపించాడు అంటూ దుమ్మెత్తి పోస్తున్నాడు.

ఇండస్ట్రీలోకి వారసుల పిల్లలని పరిచయం చేస్తూ కొత్త వాళ్లకి రావాల్సిన అవకాశాలు వాళ్ళకి వచ్చేలా కరణ్ చేస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.అయితే అందరూ తననే దోషిగా చూపించడంతో కరణ్ జోహార్ సైతం సైలెంట్ గా ఉండిపోయారు.

సుశాంత్ ఆత్మహత్యకు పరోక్ష కారకుడన్న వాదనల నడుమ, దాదాపు లక్షమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కరణ్ జొహార్ ను అన్ ఫాలో చేశారు.ఇదే సమయంలో ఇటు కరణ్ జొహార్ కూడా అనేకమంది బాలీవుడ్ నటీనటులను, ఇతర ప్రముఖులను అన్ ఫాలో చేశారు.

Advertisement

ట్విట్టర్ లో కరణ్ ఇప్పుడు కేవలం ఎనిమిది మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.వారిలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ వంటివారు ఉన్నారు.

కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సుశాంత్ పై వ్యాఖ్యలు చేసిన అలియా భట్ ను కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.అలాగే కరణ్ జోహార్, అలియా భట్ సినిమాలు బహిష్కరించాలని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపిస్తున్నారు.

మరి ఈ సుశాంత్ ఇష్యూ బాలీవుడ్ లో ఎంత వరకు రచ్చ అవుతుందో అనేది చూడాల్సిందే.

ఎటూ తేలని 'ఖమ్మం ' కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  ? పోటీలో ప్రియాంక గాంధీ ? 

Advertisement

తాజా వార్తలు